హెరిటేజ్‌లో గడువు తీరిన వస్తువులు
హిమాయత్‌నగర్: హిమాయత్‌నగర్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన హెరిటేజ్ ఫ్రెష్‌లో కుళ్లిపోయిన పండ్లు, ఎక్స్పైరీ ముగిసిన తినుబండారాలు దర్శనమిస్తాయి. బుధవారం రేఖ అనే మహిళ హెరిటేజ్ ఫ్రెష్ స్టోర్‌కు వెళ్లి నెయ్యి, బొబ్బట్లు, పరోటాలు కొనుగోలు చేసింది. ఇంటికి వెళ్లి వాటిని పరిశీలించగా గడువు తీరిననట్లుగా గుర్తించి నిర్వాహకులను నిలదీసింది. ఈ క్రమంలో స్టోర్‌లో ఉన్న తినుబండారాలు, పండ్లు, కూరగాయాలు, తదితర వస్తువుల్ని పరిశీలించగా సరుకుల్లో నాణ్యత పాటించడం లేదని స్పష్టమైంది.
బొబ్బట్లు, పరోట, ఎక్స్పైరీ డేట్ ముగియగా, నెయ్యిపై తయారీ ఏమీ లేకపోగా, సపోటా, అంజీర్ పళ్లు కుళ్లిపోయి దుర్వాసన వస్తున్నాయి. దీనిపై సిబ్బందిని ప్రశ్నించగా స్టోర్ రీజనల్ మేనేజర్ సచిన్ ఆమె పట్ల దురుసుగా ప్రవర్తించడంతో అక్కడే వినియోగదారులు ఆమెకు మద్దతుగా నిలవడంతో వారు వెనక్కి తగ్గారు. దీనిపై ఫుడ్ క్వాలిటీ సేఫ్టీ అధికారులు స్పందించకపోతే గురువారం స్టోర్ ఎదుట ఆందోళన చేపడతామని వారు హెచ్చరించారు.