రూ.5.21 లక్షలు పలికిన గణేష్ లడ్డూ
హైదరాబాద్: వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పూజలు అందుకుంటున్న గణనాథుల లడ్డూలు వేలంలో అధిక రేటు పలుకుతున్నాయి. గురువారం నగరంలోని బడంగ్‌పేటలో గణేషుని లడ్డూ రూ. 5.21 లక్షలు పలికింది.
పూజలందుకున్న గణనాథుడి లడ్డూను తమ సొంతం చేసుకునేందుకు భక్తులు ఉత్సాహంగా వేలంలో పాల్గొన్నారు. చివరికి వినాయక లడ్డూను వేలంలో బాదం నర్సింహయాదవ్ అనే వ్యక్తి రూ. 5.21 లక్షలకు దక్కించుకున్నారు.