ఘరానా హంతకుడు అరెస్ట్
కాకినాడ: ఓ ఘరానా హంతకుడిని సోమవారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోవడమే వారిపాలిట శాపంగా మారింది. బదిరెడ్డి వెంకటేశ్ అనే వ్యక్తి బాకీ కింద వేరేవారితో డబ్బులు తీసుకున్నాడు.
తిరిగి తన బాకీ చెల్లించమని అడగడంతో ఆగ్రహించిన వెంకటేశ్ నలుగురిని హతమార్చాడు. తినే భోజనంలో మత్తు పదార్థం కలపడంతో వారు మరణించారని పోలీసులు తెలిపారు. నిందితుడు బదిరెడ్డి వెంకటేశ్‌తో సహా అతనికి సహకరించిన మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.