బుల్లితెర నటుడు బాజీ అరెస్టు
హైదరాబాద్ : కుటుంబ కలహాల నేపథ్యంలో బుల్లితెర నటుడు బాజీని విజయవాడ గన్నవరం పోలీసులు బుధవారం జూబ్లీహిల్స్‌లో అరెస్టు చేశారు. జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్-1లోని చిరంజీవి బ్లడ్‌బ్యాంక్ సమీపంలో బుధవారం బాజీ ప్రధాన పాత్రలో నటిస్తున్న స్వాతిచినుకులు సీరియల్ షూటింగ్ జరుగుతుండగా జూబ్లీహిల్స్ పోలీసుల సహకారంతో గన్నవరం పోలీసులు అక్కడికి చేరుకొని అరెస్టుచేశారు.
బాజీ భార్య సోమ ఇటీవల భర్తపై గన్నవరం పోలీసులకు ఫిర్యాదు చేసింది. అతడిపై సెక్షన్ 380, 406 కింద అక్కడి పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు గతంలో ఆడదే ఆధారం సీరియల్లోనూ ప్రధానపాత్ర పోషించడంతోపాటు పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించినట్లు పోలీసులు తెలిపారు.