పోలీస్ అయినా... పబ్లిక్ అయినా...
శ్రీకాకుళం సిటీ : పబ్లిక్ అయినా.. పోలీస్ అయినా ఒక్కటే..అని నిరూపించారు శ్రీకాకుళం ట్రాఫిక్ డీఎస్పీ పి.శ్రీనివాసరావు. శనివారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా హెల్మెట్ ధారణ తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని డీఎస్పీ తూచ తప్పకుండ అమలు చేశారు.
పట్టణ పరిధిలో రామలక్ష్మణ జంక్షన్, బలగ, అరసవల్లి మిల్లు జంక్షన్, డేఅండ్నైట్ జంక్షన్దరి దత్తాత్రేయ ఆలయంతో పాటు పలు ప్రాంతాల్లో స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. శనివారం రాత్రి 8.30 నిమిషాలకు మొత్తం 425 కేసులు నమోదు చేసి, రూ. 49,200 అపరాధ రుసుం వసూలు చేసినట్లు డీఎస్పీ సాక్షికి తెలిపారు. వీరి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. ముగ్గురు పోలీసులమీద కూడా కేసులు నమోదు చేసినట్లు చెప్పారు.