8 మంది ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్టు
బాలపల్లి: ఎర్రచందనం దుంగలను అక్రమంగా తరలిస్తున్న 8 మంది తమిళ కూలీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 29 దుంగలను స్వాధీనం చేసుకున్న సంఘటన మంగళవారం కడప జిల్లా బాలపల్లి చెక్‌పోస్టు వద్ద జరిగింది. చెక్‌పోస్ట్ తనిఖీల్లో భాగంగా బాలపల్లి వద్ద ఓ వాహనంలో 16 ఎర్రచందనం దుంగలను తరలిస్తున్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారు ఇచ్చిన సమాచారం మేరకు మరో ఆరుగురిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి 13 దుంగలను స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడుకు చెందిన ఒక వాహనం స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.