శాకాంబరిగా బాలత్రిపురసుందరిదేవి
సింహాచల ః సింహగిరి క్షేత్రపాలకుడు త్రిపురాంతకస్వామి ఆలయంలో వేంజేసిన బాలత్రిపురసుందరీదేవి సోమవారం శాకాంబరిగా దర్శనమిచ్చింది. అధిక సంఖ్యలో భక్తులు శాకాంబరిగా దర్శనమిచ్చిన అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. మొత్తం 300 కిలోలతో 27 రకాల కూరగాయలతో అమ్మవారిని, త్రిపురాంతకస్వామిని, ఆలయంలో వేంజేసిన గణపతి, సుబ్రహ్మణ్యస్వామిలను అలంకరించారు. అలాగే ఆలయాన్ని కూడా అలంకరించారు. ఆలయ అర్చకుడు రమణమూర్తి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.