balraju
-
ఉద్యోగం ఇస్తామని చెప్పి మోసం..
వనపర్తి క్రైం: సబ్‌స్టేషన్‌లో ఉద్యోగం ఇస్తామని చెప్పిన విద్యుత్ అధికారుల మాటలు నమ్మి తనకున్న భూమిని వారికి అప్పగించాడు. తీరా అధికారులు ఇచ్చిన మాట నెరవేర్చకపోయే సరికి ఏం చేయాలో తెలియక ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన వనపర్తి జిల్లా చందాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మోటపోతు బాలరాజు (28), శివరాములు ఐటీఐ పూర్తి చేశారు. ఆరేళ్ల కిత్రం గ్రామానికి 33/11 కేవీ సబ్‌స్టేషన్ మంజూరైంది. దీని ఏర్పాటుకు ప్రభుత్వ భూమి అందుబాటులో లేకపోవడంతో.. భూమి సమకూరిస్తే ఉద్యోగాలు ఇస్తామని అధికారులు చెప్పడంతో 2016లో గ్రామస్తులు అంగీకరించారు. దీంతో ఉద్యోగం కోసం బాలరాజు తల్లిదండ్రులను ఒప్పించి తనకున్న ఎకరన్నర భూమిని అమ్మాడు. శివరాములు వద్ద ఉన్న డబ్బులు, బాలరాజు భూమి అమ్మిన డబ్బులు కలిపి మరోచోట సర్వే నం.58లో 30 గుంటలను కొనుగోలు చేసి అదే ఏడాది మార్చి 29న వనపర్తి డీఈ తాళ్లపల్లి లింగయ్యకు అప్పగించారు. అయితే సబ్‌స్టేషన్ ప్రారంభమైనా ఇంతవరకు వారిద్దరికీ ఉద్యోగాలు రాలేదు. మరో పది రోజుల్లో పెళ్లి.. అధికారులు ఇస్తామన్న ఉద్యోగం రాలేదన్న మనస్తాపంతో శనివారం రాత్రి కుంగిపోయాడు. దీంతో ఆదివారం ఉదయం గ్రామంలోని నీటిట్యాంకు వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన స్థానికులు కుటుంబసభ్యులకు సమాచారం అందించగా వారు ఘటనా స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. బాలరాజుకు ఈ నెల 14న పెళ్లి చేయాలని తల్లిదండ్రులు నిర్ణయించారు. ఆదివారం పెళ్లి దుస్తులు తీసుకోవాల్సి ఉండగా ఈ ఘటన చోటుచేసుకోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఉద్యోగం ఇస్తామని చెప్పిన అధికారులు మాట తప్పినందుకే బాలరాజు ఆత్మహత్యకు పాల్పడ్డాడంటూ మృతదేహాన్ని ప్రధాన రహదారిపై ఉంచి గ్రామస్తులు రాస్తారోకో నిర్వహించారు. పోలీసులు వచ్చి నచ్చజెప్పడంతో శాంతించారు. బాధిత కుటుంబాన్ని మాజీ ఎమ్మెల్యే చిన్నారెడ్డి, కాంగ్రెస్ నాయకులు పరామర్శించారు. -
బాల్‌రాజ్.. అంతా బాగుందా..
ఎర్రవల్లి ఆభివృద్ధి పనులపై సీఎం ఆరా జగదేవ్‌పూర్: ‘ఏమి బాల్‌రాజు.. అంతా సెట్‌రైట్ అయిందా.. పనులెట్లా సాగుతున్నాయ్..’ అంటూ ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర్‌రావు శుక్రవారంరాత్రి ఫాంహౌస్‌కు వెళుతూ మెదక్ జిల్లా జగదేవ్‌పూర్ మండలం ఎర్రవల్లిలో సర్పంచ్ భర్త టీఆర్ఎస్ నేత బాల్రాజును పలకరించారు. కేసీఆర్ ఫాంహౌస్ వస్తున్నారని సమాచారం ఉండడంతో బాల్రాజుతోపాటు మరో ఐదుగురు నాయకులు రోడ్డు పక్కన పాఠశాల దగ్గర వేచి ఉన్నారు. ఎర్రవల్లికి చేరుకుగానే వారిని చూసి సీఎం కాన్వాయ్ ఆపి ఇలా పలకరించారు. ఈ నెల 8న చైనా పర్యటనకు వెళ్లుతున్న క్రమంలో ఓ సారి వ్యవసాయక్షేత్రంలో వ్యవసాయ పనులను పరిశీలించేందుకు సీఎం వచ్చినట్లు తెలుస్తోంది. శనివారం ఫాంహౌస్‌లోనే ఉండి, ఆదివారం ఉదయం హైదరాబాద్‌కు వెళ్లనున్నట్లు సమాచారం. -
పేద కుటుంబానికి ఆపన్న హస్తం
స్పందించిన మంత్రి హరీష్‌రావు ఎంపీపీ, ఓఎస్డీల ద్వారా ఆర్థిక సాయం చిన్నకోడూరు : రామంచ గ్రామానికి చెందిన నిరుపేద జంగపల్లి నర్సింలు కిడ్నీ సంబంధిత వ్యాధితో మంచం పట్టాడు. కుటుంబ పెద్ద మంచం పట్టడంతో భార్య అన్నీ తానై కుటుంబాన్ని పోషిస్తున్న వైనంపై ‘పేద కుటుంబానికి పెద్ద కష్టం’ శీర్షికన బుధవారం సాక్షి దినపత్రికలో కథనం ప్రచురితమైంది. దీనికి భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు స్పందించారు. వెంటనే ఓఎస్డీ బాల్‌రాజు, ఎంపీపీ కూర మాణిక్యరెడ్డిలను ఆ కుటుంబ పరిస్థితులను పరిశీలించమని ఆదేశించారు. వారు బుధవారం ఆ కుటుంబాన్ని పరామర్శించి నర్సింలు భార్య పద్మకు రూ. 5 వేలు ఆర్థిక సహాయం అందజేశారు. నర్సింలుకు వైద్యం అందించడం తోపాటు మందులు ఉచింతంగా అందజేయడానికి చర్యలు తీసుకుంటామన్నారు. పిల్లల ఉన్నత చదువుకు సహకరిస్తామన్నారు.