స్వాతంత్య్ర సమరయోధుడి కన్నుమూత
నర్సంపేట : పట్టణానికి చెందిన స్వా తంత్య్ర సమరయోధుడు బండారి కాశీ నాథం(90) ఆదివారం ఉదయం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యం తో బాధపడుతున్న ఆయన స్వాతం త్య్ర దినోత్సవం జరుపుకోవడానికిఒక రోజు ముందే కన్నుమూయడం స్థానికంగా విషాదాన్ని నింపింది. కాశీనాథంకు భార్య రామానుజ, కుమారులు రమేష్, రాంబాబుతో పాటు ముగ్గురు కుమార్తె లు ఉన్నారు. కాశీనాథం భౌతికకాయా న్ని టీఆర్ఎస్ నేత పెద్ది సుదర్శన్‌రెడ్డి, కాంగ్రెస్ నాయకులు తక్కెళ్లపల్లి రవీం దర్రావు, శ్రీనివాస్, పెండెం రామానంద్, చింతల సాంబరెడ్డి, బా నోత్ లక్ష్మణ్, పుల్లూరి స్వామి, సాంబయ్య తదితరులు సందర్శించి నివాళులర్పించారు.