ల్యాండ్‌మైన్ నిర్వీర్యం..తప్పిన ముప్పు
రాయిపూర్(ఛత్తీస్‌గఢ్):
ఛత్తీస్‌గఢ్‌లోని బిజాపూర్ జిల్లాలో శనివారం జరిగిన వేర్వేరు ఘటనల్లో భద్రతా బలగాలు ఒక మావోయిస్టును అరెస్టు చేయటంతోపాటు మందుపాతరను వెలికి తీశారు. మారేడుబాక అటవీ ప్రాంతంలో కూంబింగ్ జరుపుతున్న భద్రతా బలగాలకు భండారి రామ్మూర్తి(24) అనే మావోయిస్టు పట్టుబడ్డాడు. ఉసూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో 2015లో పోలీసులపై జరిపిన కాల్పుల ఘటనలో రామ్మూర్తి కూడా సభ్యుడని విచారణలో తేలింది.
సర్కేగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో రోడ్డు పక్కన అమర్చిన ఐదు కిలోల ఐఈడీని బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ గుర్తించి వెలికి తీసింది. పోలీసులే లక్ష్యంగా మావోయిస్టులు దీనిని అమర్చి ఉంటారని భావిస్తున్నారు.