మావోల బంద్పై పోలీస్ నిఘా
రంపచోడవరం : మావోయిస్టు రాష్ట్ర బంద్ నేపథ్యలో ఏజెన్సీలో భద్రత కట్టుదిట్టం చేసినట్లు జిల్లా ఎస్పీ రవిప్రకాష్ తెలిపా రు. గురువారం రాష్ట్ర బం ద్కు మావోలు పిలుపు ఇవ్వడంతో ఎస్పీ రంపచోడవరం వచ్చి ఏఎస్పీ అడ్నాన్ నయి ఆస్మీతో కలిసి స్వయంగా పర్యవేక్షించారు. అనంతరం పోలీస్ స్టేష¯ŒSలో విలేకర్లుతో మాట్లాడుతూ ఏజెన్సీలో బంద్ ప్రభావం ఉండదన్నారు. మావోల నుంచి ఎటువంటి సంఘటనలునైనా తిప్పికొట్టేందుకు కౌంటర్ యాక్షన్ టీమ్లు, సీఆర్పీఎఫ్, స్పెషల్ పార్టీలను రంగంలోకి దించినట్లు చెప్పారు. ఏఓబీ సరిహద్దున ఉన్న డొంకరాయి, ఎటపాక, ఏడుగురాళ్లపల్లి, చింతూరు, మోతుగూడెం పోలీస్స్టేçÙ¯ŒSలకు భద్రత పెంచామన్నారు. ఒడిశా రాష్ట్రం మల్కన్ గిరి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్పై ప్రజాసంఘాలు, మావోయిస్టు ఫ్రంట్ ఆర్గనైజేన్ లు తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్నారు. బలిమెలలో 34 మంది గ్రేహోండ్స్, చత్తీస్గఢ్లో 75 మంది సీఆర్పీఎఫ్ పోలీసులను బలిగొన్న మావోయిస్టుల చర్యలను ప్రజా సంఘాలు ఎందుకు ప్రశ్నించలేదన్నారు. తుపాకితో తిరిగే హక్కు ఎవరికి లేదని, శాంతిభద్రతల పరిరక్షణకు పోలీస్ వ్యవస్థ నిరంతరం పని చేస్తుందన్నారు. ఉద్యమంలో ఉండి మావోలు సాధించేది ఏం లేదని జనజీవన్ స్రవంతిలోకి రావాలన్నారు. కమ్యూనిటీ పోలీసింగ్ ద్వారా గిరిజన యువతకు ఉపాధి అవకాశాలతో పాటు గ్రామాల్లో సమస్యలు పరిష్కారానికి పోలీసులు కృషి చేస్తున్నట్లు చెప్పారు. సీఐ గీతారామకృష్ణ, ఎస్సై జె.విజయబాబు ఉన్నారు.