Bandicoot
-
మొన్న ఎలుకలు.. ఇప్పుడు పందికొక్కులు
-
ప్రభుత్వ ఆసుపత్రిలో పందికొక్కులు
గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఎలుకల ఘటన మరవక ముందే.. అనంతపురం జిల్లా గుంతకల్లు ప్రభుత్వాసుపత్రిలో ఓ మహిళను పందికొక్కులు కరిచి గాయపరిచాయి. వివరాల్లోకి వెళితే.. వజ్రకరూరు మండలం పందికుంట గ్రామానికి చెందిన లక్ష్మి అనే మహిళ రెండు రోజుల క్రితం కాన్పు కోసం గుంతకల్లు ప్రభుత్వ ఆస్పత్రిలో చేరింది. అయితే లక్ష్మికి సహాయకురాలుగా వచ్చిన తల్లి ఎర్రమ్మ (55) ను ఆదివారం రాత్రి పందికొక్కు కరిచింది. ఉలిక్కిపడిన ఎర్రమ్మ నిద్ర నుంచి మేల్కొని చూస్తే.. వార్డులో పందికొక్కులు కనిపించాయి. గాయపడిన ఎర్రమ్మకు నర్సులు చికిత్స చేశారు. ఆస్పత్రిలో పరిశుభ్రత లోపించడం వల్ల పందికొక్కులు, ఎలుకలు ఎక్కువయ్యాయని.. ఆరోగ్యం కోసం ఆస్పత్రికి వస్తే.. ప్రాణాలే పోయే పరిస్థితి ఎదురైతోందని రోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
మృతదేహాన్ని పీక్కుతిన్న పందికొక్కులు
కామారెడ్డి: ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చిన రోగులను వైద్య సిబ్బంది లంచాల రూపంలో హడలెత్తిస్తుంటే... మరోవైపు పోస్ట్మార్టం నిర్వహించిన మృతదేహాలను మార్చురీలో పందికొక్కులు పీక్కుతింటున్నాయి. అలా మృతదేహన్ని పందికొక్కులు పీక్కుతిన్న హృదయ విదారక సంఘటన నిజామాబాద్ జిల్లా కామారెడ్డి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చోటు చేసుకుంది. నిజామాబాద్ జిల్లాలోని సొంతూరు మండలం దేవునిపల్లి గ్రామానికి చెందిన ఎర్ల పండరి వెళ్తున్న ద్విచక్రవాహనాన్ని గురువారం పంది ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో పండరి అక్కడికక్కడే మరణించాడు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పండరి మృతదేహన్ని ఆసుపత్రికి తరలించారు. పండరి మరణించినట్లు వైద్యులు దృవీకరించి... పోస్ట్ మార్టం నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మృతదేహన్ని మార్చురీకి తరలించారు. అయితే పండరీ కుటుంబ సభ్యులు శుక్రవారం ఉదయం ఆసుపత్రికి చేరుకున్నారు. మృతదేహన్ని తమకు చూపించాలని డిమాండ్ చేయడంతో సిబ్బంది మృతదేహాన్ని మార్చురీలో నుంచి బయటకు తీసుకువచ్చారు. అయితే మృతదేహం ముఖం ఛిద్రంగా తయారైంది. ఇదేమిటని పండరి కుటుంబసభ్యుల ప్రశ్నించగా.. పందికొక్కులు పీక్కుతిన్నాయని సిబ్బంది వెల్లడించారు. దాంతో పండరీ కుటుంబసభ్యులు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని వారు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో ఉద్రికత్త వాతావరణం నెలకొంది.