బండిజల్ల సైకిల్‌పై ఇలా..
సైకిల్‌పై నీడ కోసం బండిజల్లను గొడుగులా పెట్టుకున్నారనుకుంటే పొరపాటే! ఎరువును తరలించేందుకు అవసరమైన బండిజల్ల(పొనక)ను ఇదిగో ఇలా కొత్తగూడెంలోని బృందావనం బ్రిడ్జి మీదుగా తీసుకెళ్తుండగా‘సాక్షి’ కెమెరా క్లిక్‌మనిపించింది. ట్రాక్టర్లు, వ్యానులు, లారీలు గ్రామీణ ప్రాంతాల్లో అంతగా అందుబాటులో లేని రోజుల్లో ఎరువులు, ఇసుక, మట్టి తదితరాలను ఈ పొనకను ఎడ్లబండిపై ఉంచి తరలించేవారు. ఇప్పటిలాగా ఆటోలు, బస్సులు తదితర వాహనాలు లేని నాటి రోజుల్లో ప్రజలు దూర ప్రాంతాలకు ఎడ్లబండిపై వెళ్లేవారు. పైన ఎండ తగలకుండా బండిపై పొనకను పైకప్పుగా ఉపయోగించేవారు. ఇప్పుడు ఇవి ఏ పల్లెటూరులోనూ కనినపించడం లేదు. - సాక్షి ఫొటోగ్రాఫర్, ఖమ్మం