బెంగళూరు బస్సులో బాహుబలి సీడీలు స్వాధీనం
చిత్తూరు: రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్తో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన బాహుబలి చిత్రం పైరసీకి గురికాకుండా కఠిన చర్యలు తీసుకున్నా.. పైరసీ బెడద తప్పడంలేదు. తాజాగా సోమవారం చిత్తూరు జిల్లాలో 50 పైరసీ బాహుబలి సీడీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చిత్తూరు నుంచి బెంగళూరుకు వెళ్తున్న ప్రైవేట్ బస్సులో వీటిని తీసుకెళ్తుండగా పలమనేరు పోలీసులు తనిఖీలు చేసి స్వాధీనం చేసుకున్నారు.
ఆదివారం హైదరాబాద్లో చార్మినార్ సమీపంలో సీడీ షాపులపై పోలీసులు దాడి చేసి 115 పైరసీ సీడీలు స్వాధీనం చేసుకుని ఒకరిని అరెస్ట్ చేశారు. ప్రభాస్, రానా, తమన్నా, రమ్యకృష్ణ తదితరులు నటించిన బాహుబలి శుక్రవారం విడుదలై భారీ కలెక్షన్లు సాధిస్తున్న సంగతి తెలిసింది.