‘కిస్’పై పోలీసులదే తుది నిర్ణయం
సాక్షి, బెంగళూరు : వివాదాస్పదమైన కిస్ ఆఫ్ లవ్ కార్యక్రమానికి అనుమతి ఇచ్చే విషయం బెంగళూరు పోలీస్ కమిషనర్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుదని రాష్ట్ర హోంశాఖ మంత్రి కేజే జార్జ్ స్పష్టం చేశారు. మైసూరులో ఆదివారం తనను కలిసిన మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడుతూ... కిస్ ఆఫ్ లవ్ కార్యక్రమానికి అనుమతి ఇవ్వకూడదంటూ రాష్ట్ర మహిళా కమిషన్ తనకు రాసిన లేఖ అందిందన్నారు. అయితే ఈ విషయంపై తాను ఎటువంటి నిర్ణయం తీసుకోలేనన్నారు. స్థానిక పోలీసులతో చర్చించి కమిషనర్ తుది నిర్ణయం తీసుకుంటారని తెలిపారు.