బంగ్లాతో నేరస్తుల అప్పగింత సులభం
ఢాకా: నేరస్తుల అప్పగింతకు సంబంధించి భారత్తో ఉన్న ఒప్పందంలో సవరణకు బంగ్లాదేశ్ కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో అప్పగింత మరింత సులభం కానుంది. బంగ్లా ప్రధాని షేక్ హసీనా అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఏదైనా కోర్టు నుంచి, ట్రిబ్యునల్ నుంచి వారెంట్ జారీ అయి ఉన్న భారతీయ నేరస్తుడు బంగ్లాలో తలదాచుకున్నట్లైతే, అతడిని భారత ప్రభుత్వానికి అప్పగిస్తామని అధికారులు తెలిపారు.