బ్యాంక్ మేనేజర్‌ను బదిలీ చేయాలని ధర్నా
వరంగల్ : వరంగల్ జిల్లాలోని మంగంపేట మండల కేంద్రంలోని రాజుపేట కెనరాబ్యాంక్ మేనేజర్‌ను వెంటనే బదిలీ చేయాలని మహిళా సంఘాలు సోమవారం ధర్నాకు దిగాయి. నాగ్ పూర్ కు చెందిన బ్యాంక్ మేనేజర్ కలేకర్ కు తెలుగు మాట్లాడటం సరిగా రాకపోవడంతో సమస్య తలెత్తుందని తెలిపారు. మహిళా సంఘాల వారితో అవహేళనగా మాట్లాడటం, రుణాల సరిగా ఇవ్వకపోవడం, అడిగిన వాటికి సరైన సమాధానాలు ఇవ్వరంటూ మహిళలు ధర్నాకు దిగారు. మేనేజర్ని వెంటనే బదిలీ చేయాలని బ్యాంకు ఎదుట రెండు గంటలపాటు ఆందోళన చేశారు.
(మంగంపేట)