చెల్లిని ఈవ్ టీజింగ్ చేశాడని నరికేశాడు..
లక్నో: సోదరిని వేధించిన16 ఏళ్ల టీనేజర్ ను ఆమె అన్నయ్య గొడ్డలితో నరికి చంపాడు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లో శనివారం చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బల్దియా జిల్లాలోని బన్స్ దియా నగర పంచాయతీకి చెందిన 16 ఏళ్ల టీనేజర్ గత కొద్ది రోజులుగా అదే ప్రాంతానికి చెందిన ఓ అమ్మాయిని వేధిస్తున్నాడు. విషయం తెలుసుకుని ఆగ్రహించిన అమ్మాయి అన్నయ్య ఆ కుర్రాడిని గొడ్డలితోనరికి చంపాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడిని అరెస్ట్ చేశారు.