గౌతమ్ సక్సెస్‌ని చరణ్ సక్సెస్‌గా భావిస్తాను - చిరంజీవి
‘‘బ్రహ్మానందం నా కుటుంబంలో ఒకరు. ఆయన నాకు సోదరుడితో సమానం. వాళ్లబ్బాయి గౌతమ్ నాకు కొడుకులాంటివాడు. గౌతమ్ సక్సెస్‌ని రామ్‌చరణ్ సక్సెస్లాగానే భావిస్తాను. ‘బసంతి’ పెద్ద హిట్టు అయ్యి గౌతమ్‌కి మంచి బ్రేక్‌నివ్వాలి’’ అని చిరంజీవి ఆకాంక్షించారు. గౌతమ్ హీరోగా ‘బాణం’ ఫేమ్ చైతన్య దంతులూరి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘బసంతి’. ఈ సినిమా యూనిట్ ఇటీవల హైదరాబాద్‌లో చిరంజీవి, రామ్‌చరణ్‌లను కలిసింది.
ఈ సందర్భంగా రామ్‌చరణ్ మాట్లాడుతూ -‘‘గౌతమ్ నాకు బాగా క్లోజ్. ఇద్దరం రోజూ జిమ్‌లో కలుస్తుంటాం. తనలో ఆర్టిస్టుగా మంచి పొటెన్షియాల్టీ ఉందని నమ్ముతున్నాను. ‘బసంతి’తో కచ్చితంగా తనని తాను ప్రూవ్ చేసుకుంటాడు. దర్శకుడు చైతన్య కూడా సమర్థుడు’’ అని చెప్పారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మానందం, సహ నిర్మాత వివేక్ కూఛిబొట్ల, పాటల రచయిత కృష్ణ చైతన్య పాల్గొన్నారు.