పాము కాటుతో వ్యక్తి మృతి
పక్కింట్లోకి పాము వచ్చిందని తరమడానికి ప్రయత్నించిన వ్యక్తి ప్రమాదవశాత్తు ఆ పాము కాటుకు గురై మృతిచెందిన సంఘటన మైలార్ దేవుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని లక్ష్మిగూడ హౌజింగ్ బోర్డు కాలనీలో బుధవారం చోటుచేసుకుంది. కాలనీకి చెందిన బసప్ప(45) దాన్ని తరమడానికి ప్రయత్నిస్తున్న క్రమంలో పాముకాటుకు గురై మృతిచెందాడు.