base rate cut
-
ఎస్బీఐ ఖాతాదారులకు శుభవార్త!
న్యూఢిల్లీ: ఎస్బీఐ తన ఖాతాదారులకు అదిరిపోయే శుభవార్త తెలిపింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) వడ్డీరేట్లను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. బేస్ రేట్లను 5 బేసిస్ పాయింట్లు అంటే 0.05 శాతం తగ్గించాలని ఎస్బీఐ 14 సెప్టెంబర్ 2021న నిర్ణయించింది. దీని తర్వాత కొత్త వడ్డీ రేట్లు 7.45 శాతంగా ఉంటాయి. అదే సమయంలో ప్రైమ్ రుణ రేటు(పీఎల్ఆర్)ను కూడా 12.20 శాతానికి(5 బేసిస్ పాయింట్లు తగ్గించి) తగ్గిస్తున్నట్లు బ్యాంకు తెలిపింది. ఈ కొత్త రేట్లు 15 సెప్టెంబర్ 2021 నుంచి అమలులోకి రానున్నాయి. గతంలో ఏప్రిల్ 2021లో ఎస్బీఐ గృహ రుణాల రేట్లను 6.70 శాతానికి, మహిళా రుణగ్రహీతలకు ప్రత్యేక రాయితీ కింద 5 బీపీఎస్ తగ్గించింది. బేస్ రేటు అనేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేత ప్రభావితం చెందుతాయి. సెంట్రల్ బ్యాంక్ నిర్దేశించిన బేస్ రేటు కంటే తక్కువ రేటుతో రుణాలు ఇవ్వడానికి బ్యాంకులకు అనుమతి లేదు. సెంట్రల్ బ్యాంక్ నిర్దేశించిన ప్రస్తుత బేస్ రేటు 7.30-8.80 శాతంగా ఉంది. ఎస్బీఐ తాజాగా తీసుకున్న ఈ నిర్ణయం సామాన్యుడి జేబుపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. ఈ కొత్త వడ్డీరేట్ల వల్ల ఎస్బీఐ కస్టమర్లు ప్రతి నెల చెల్లించే గృహ రుణం, ఆటో రుణం, వ్యక్తిగత రుణంతో సహా వివిధ రకాల రుణాల వాయిదాలు తక్కువగా చెల్లించాల్సి ఉంటుంది.(చదవండి: ఎంఐ ప్రియులకి షియోమీ షాకింగ్ న్యూస్) -
న్యూ ఇయర్ బొనాంజా : ఖాతాదారులకు ఎస్బీఐ గుడ్‌న్యూస్
సాక్షి, ముంబయి: కొత్త ఏడాది ఖాతాదారులకు ప్రభుత్వ రంగ ఎస్బీఐ తీపికబురు అందించింది. బేస్ రేటు ప్రకారం లోన్లు పొందిన పాత కస్టమర్లకు ఊరట కల్పిస్తూ బేస్ రేటును 0.3 శాతం తగ్గించింది. దీంతో బేస్ రేటు ప్రస్తుతం 8.65 శాతానికి దిగివచ్చింది. తాజా తగ్గింపుతో ఇతర బ్యాంకులతో పోలిస్తే ఎస్బీఐ బేస్ రేటు అతితక్కువ కావడం గమనార్హం. మిగిలిన బ్యాంకులూ ఎస్బీఐ బాటలో బేస్ రేటును తగ్గించవచ్చని భావిస్తున్నారు. ఎస్బీఐ చర్యతో పలు కస్టమర్లకు భారీ ఊరట లభించనుంది. విద్యార్థులు, గృహ రుణాలు తీసుకున్న కస్టమర్లు తమ రుణాలపై బేస్ రేటుకు అనుగుణంగా వడ్డీ రేట్లు ఉండటంతో తాజా తగ్గింపుతో వీరందరికీ ప్రయోజనం చేకూరనుంది. -
ఐసీఐసీఐ బ్యాంక్ బేస్ రేటు కోత
న్యూఢిల్లీ: కనీస రుణ (బేస్) రేటు తగ్గింపు బాటలో గురువారం మరి కొన్ని బ్యాంకులు నిలి చాయి. ఇందులో ప్రైవేటు రంగ బ్యాంకింగ్ దిగ్గజం- ఐసీఐసీఐ బ్యాంక్ కూడా ఉంది. ఈ బ్యాంక్ 0.35% రేటు తగ్గిస్తే... అలహాబాద్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ జైపూర్(ఎస్‌బీబీజే) యస్ బ్యాంక్, కొటక్ మహీంద్రా బ్యాంక్ కనీస రుణ రేటును పావు శాతం తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. కాగా దేనా బ్యాంక్ 0.3% కనీస రుణరేటును తగ్గించింది. అన్ని బ్యాంకులూ అక్టోబర్ 5 నుంచీ తాజా రేటు అమలు చేస్తున్నట్లు ప్రకటించాయి. ఆర్బీఐ రెపో రేటును అరశాతం తగ్గించిన నేపథ్యంలో ఇప్పటికే ఎస్బీఐ సహా పలు బ్యాంకులు బేస్ రేటును తగ్గించడం తెలిసిందే.ఐసీఐసీఐ బ్యాంక్: బ్యాంక్ రేటు 9.35 శాతానికి తగ్గింది. దీనితో ఐసీఐసీఐ బ్యాంక్ రుణ రేటు రెండవ అతిపెద్ద ప్రైవేటు బ్యాంక్ హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌తో సరిసమానమైంది. ప్రభుత్వ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ రేటు 9.30 శాతంగా అతి తక్కువగా ఉంది. కాగా రూ.కోటికిపైగా బల్క్ డిపాజిట్లపై వడ్డీరేటును ఐసీఐసీఐ బ్యాంక్ పావుశాతం తగ్గించింది. అలహాబాద్ బ్యాంక్: ఈ ప్రభుత్వ రంగ బ్యాంక్ బేస్ రేటు పావు శాతం తగ్గడంతో 9.70 శాతానికి చేరింది. ఎస్‌బీబీజే: ఈ ఎస్బీఐ అనుబంధ బ్యాంక్ రేటు 9.70 శాతానికి చేరింది. కొటక్ మహీంద్రా బ్యాంక్: ప్రైవేటు రంగంలోకి ఈ బ్యాంక్ బేస్ రేటు 9.50 శాతానికి తగ్గింది. యస్ బ్యాంక్: 10.25%కి రేటు దిగివచ్చింది. దేనా బ్యాంక్: కాగా దేనా బ్యాంక్ రుణ రేటును 0.30% తగ్గించింది. దీంతో 9.70 శాతానికి తగ్గింది.