న్యూఢిల్లీ: కనీస రుణ (బేస్) రేటు తగ్గింపు బాటలో గురువారం మరి కొన్ని బ్యాంకులు నిలి చాయి. ఇందులో ప్రైవేటు రంగ బ్యాంకింగ్ దిగ్గజం- ఐసీఐసీఐ బ్యాంక్ కూడా ఉంది. ఈ బ్యాంక్ 0.35% రేటు తగ్గిస్తే... అలహాబాద్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ జైపూర్(ఎస్‌బీబీజే) యస్ బ్యాంక్, కొటక్ మహీంద్రా బ్యాంక్ కనీస రుణ రేటును పావు శాతం తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. కాగా దేనా బ్యాంక్ 0.3% కనీస రుణరేటును తగ్గించింది. అన్ని బ్యాంకులూ అక్టోబర్ 5 నుంచీ తాజా రేటు అమలు చేస్తున్నట్లు ప్రకటించాయి.
ఆర్‌బీఐ రెపో రేటును అరశాతం తగ్గించిన నేపథ్యంలో ఇప్పటికే ఎస్‌బీఐ సహా పలు బ్యాంకులు బేస్ రేటును తగ్గించడం తెలిసిందే.ఐసీఐసీఐ బ్యాంక్: బ్యాంక్ రేటు 9.35 శాతానికి తగ్గింది. దీనితో ఐసీఐసీఐ బ్యాంక్ రుణ రేటు రెండవ అతిపెద్ద ప్రైవేటు బ్యాంక్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌తో సరిసమానమైంది. ప్రభుత్వ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బీఐ రేటు 9.30 శాతంగా అతి తక్కువగా ఉంది. కాగా రూ.కోటికిపైగా బల్క్ డిపాజిట్లపై వడ్డీరేటును ఐసీఐసీఐ బ్యాంక్ పావుశాతం తగ్గించింది.
అలహాబాద్ బ్యాంక్: ఈ ప్రభుత్వ రంగ బ్యాంక్ బేస్ రేటు పావు శాతం తగ్గడంతో 9.70 శాతానికి చేరింది. ఎస్‌బీబీజే: ఈ ఎస్‌బీఐ అనుబంధ బ్యాంక్ రేటు 9.70 శాతానికి చేరింది. కొటక్ మహీంద్రా బ్యాంక్: ప్రైవేటు రంగంలోకి ఈ బ్యాంక్ బేస్ రేటు 9.50 శాతానికి తగ్గింది. యస్ బ్యాంక్: 10.25%కి రేటు దిగివచ్చింది. దేనా బ్యాంక్: కాగా దేనా బ్యాంక్ రుణ రేటును 0.30% తగ్గించింది. దీంతో 9.70 శాతానికి తగ్గింది.
ఐసీఐసీఐ బ్యాంక్ బేస్ రేటు కోత
Published Thu, Oct 1 2015 11:47 PM | Last Updated on Sun, Sep 3 2017 10:18 AM
Advertisement
Advertisement