72కి చేరిన సిరియా విషదాడి మృతుల సంఖ్య
బీరుట్: సిరియాలో విషదాడి మృతుల సంఖ్య బుధవారం 72కు పెరిగింది. దాడి జరిగిన చోటుకి సమీపంలోని ఆవాసాల్లో ఇంకా పలువురు ఆశ్రయం పొందుతున్నట్లు సహాయక సిబ్బంది గుర్తిం చారు. మరోవైపు ఖాన్ షేకౌన్ పట్టణంలో వాయు దాడులు తిరిగి ప్రారంభమయ్యాయని సిరియా ప్రతిపక్ష పార్టీలు ఆరోపించాయి. మంగళవారం నాటి విషదాడులకు అధ్యక్షుడు బషర్ అసద్, ఆయన మద్దతుదారులు, ఇరాన్, రష్యాలు బాధ్యత వహించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డిమాండ్ చేశారు.
ఈ దాడి వెనక తమ పాత్ర లేదని సిరియా, రష్యా ప్రభుత్వా లు తెలిపాయి. తిరుగుబాటుదారుల ఆయుధాగారాలపై సిరియా వాయుసేన దాడి చేసిన తరువాతే విష వాయు వులు విడుదలయ్యాయని రష్యా రక్షణ విభాగం తెలిపిం ది. సిరియాలో విషదాడులపై చర్చించడానికి ఐరాస భద్రతా మండలి బుధవారం అత్యవసరంగా సమావేశమ వుతోంది. 70 దేశాల ప్రతినిధులు బ్రసెల్స్‌లో సమా వేశమై సిరియా భవిష్యత్తు గురించి చర్చించారు.