జాతీయ బాస్కెట్‌బాల్ పోటీలకు వెల్ల విద్యార్థి
వెల్ల (రామచంద్రపురం రూరల్) :
జాతీయ స్థాయి స్కూల్ గేమ్స్ అండర్–14 బాస్కెట్‌బాల్ పోటీలకు తమ విద్యార్థి జి.సాయిచరణ్ సంతోష్ ఎంపికైనట్టు వెల్ల జెడ్పీ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పి.రాంబాబు, పీఈటీ బి.కృష్ణమోహ¯ŒSలు మంగళవారం విలేకర్లకు తెలిపారు. ఈ నెల 22 నుంచి 24 వరకూ పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో తూర్పు గోదావరి జిల్లా జట్టు ప్రథమ స్థానం సాధించడంలో సంతోష్ ఉత్తమ ప్రతిభ కనబరిచాడన్నారు. ఈ నేపథ్యంలో ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో నందిగామలో జరగనున్న జాతీయ స్థాయి పోటీలకు రాష్ట్ర జట్టుకు అతడు ఎంపికయ్యాడని తెలిపారు. సంతోష్‌ను సర్పంచ్ గుండుబోగుల స్వామినాయుడు, ఎస్ఎంసీ చైర్మ¯ŒS అమరా వెంకటేశ్వరరావు, మాజీ ఎంపీటీసీ సభ్యుడు పాముల సురేష్, ఉపాధ్యాయులు అభినందించారు.