ఆంధ్ర విద్యాలయ కాలేజిపై సెయింట్ మార్టిన్స్ గెలుపు
జింఖానా, న్యూస్‌లైన్: బాస్కెట్‌బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (బీఎఫ్ఐ) ఐఎంజీ రిలయన్స్ బాస్కెట్‌బాల్ లీగ్ పురుషుల విభాగంలో సెయింట్ మార్టిన్స్ ఇంజినీరింగ్ కాలేజి జట్టు గెలుపొందింది. వైఎంసీఏలో ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో సెయింట్ మార్టిన్స్ జట్టు 55-51తో ఏవీ కాలేజి జట్టుపై విజయం సాధించింది.
సెయింట్ మార్టిన్స్ జట్టు ఆటగాళ్లు సంతోష్ (20), విశాల్ (16), రవి (13) చాకచక్యంగా వ్యవహరించి జట్టుకు విజయాన్ని చేకూర్చారు. ఏవీ కాలేజి జట్టులో శామ్సన్ (18), సాయి (17), కిరణ్ (10) చక్కటి ఆటతీరు కనబరిచారు. మరో మ్యాచ్‌లో ముఫకంజా కాలేజ్ ఆఫ్ ఇంజినీ రింగ్ అండ్ టెక్నాలజి జట్టు 39-25తో మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజి జట్టుపై నెగ్గింది.