లయోలా జట్ల శుభారంభం
ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: ఫాదర్ బాలయ్య స్మారక జాతీయ అంతర్ కళాశాలల బాస్కెట్‌బాల్ టోర్నమెంట్లో హైదరాబాద్, చెన్నైలకు చెందిన లయోలా అకాడమీ జట్లు శుభారంభం చేశాయి. సికింద్రాబాద్‌లోని లయోలా అకాడమీ బాస్కెట్‌బాల్ కోర్టులో శనివారం జరిగిన పోటీల్లో హైదరాబాద్ లయోలా అకాడమీ జట్టు 79-48తో సీవీఎస్ఆర్ ఇంజినీరింగ్ కాలేజి జట్టుపై విజయం సాధించింది.
లయోలా అకాడమీ జట్టులో గణేష్ 20 పాయింట్లు చేయగా, ఉదయ్, క్రిస్‌లు చెరో 14 పాయింట్లు సాధించారు. సీవీఎస్ఆర్ ఇంజినీరింగ్ కాలేజి జట్టులో మహేశ్ 20 పాయింట్లు, మురళీ 14 పాయింట్లను నమోదు చేశారు. రెండో లీగ్ మ్యాచ్‌లో చెన్నై లయోలా అకాడమీ జట్టు 102-59తో ఏవీ కాలేజి జట్టుపై గెలిచింది. చెన్నై లయోలా అకాడమీ జట్టులో హరిశంకర్ 14, విరాత్ 10 పాయింట్లు చేయగా, ఏవీ కాలేజి జట్టు తరఫున విజయ్ 15, శ్యామ్ 11 పాయింట్లు సాధించారు. ఈ పోటీలను అంతర్జాతీయ బాస్కెట్‌బాల్ ఆటగాడు కె.విశాల్ కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేసి లాంఛనంగా ప్రారంభించారు.