batsmen talent
-
చెలరేగిన అనంత బ్యాట్స్మెన్లు
అనంతపురం సప్తగిరి సర్కిల్: ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా వెంకటగిరిలో జరుగుతున్న అండర్–16 సెమీఫైనల్ మ్యాచ్‌లో అనంత బ్యాట్స్మెన్లు చెలరేగారు. గ్రూప్–బీలో భాగంగా రెండో సెమీస్ మ్యాచ్‌లో తూర్పుగోదావరి, అనంతపురం జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన అనంతపురం జట్టు మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 95 ఓవర్లలో 269 పరుగులు సాధించి 6 వికెట్లు కోల్పోయింది. జట్టులోని మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ మహేంద్రరెడ్డి 70, గురు రాఘవేంద్ర 48, యోగానంద 26, అర్జున్ టెండూల్కర్ 29, దత్తారెడ్డి 25 పరుగులు సాధించారు. హరినాథ్ 52, కామిల్ 2 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. దీంతో అనంతపురం జట్టు భారీ స్కోరు దిశగా పరుగులు సాధిస్తుంది. -
రాణించిన అనంత బ్యాట్స్మెన్లు
అనంతపురం సప్తగిరి సర్కిల్ : వైఎస్సార్ కడప జిల్లాలో జరుగుతున్న ఏసీఏ అండర్–19 అంతర్ జిల్లా క్రికెట్ పోటీల్లో అనంత బ్యాట్స్మెన్లు రాణించడంతో అనంత జట్టు భారీ ఆధిక్యతను నమోదు చేసింది. గురువారం రెండవ రోజు అనంత జట్టు మ్యాచ్‌పై పూర్తి పట్టును సాధించింది. తొలిరోజు నెల్లూరు జట్టు 105 పరుగులు చేయగా, అనంతపురం జట్టు 442 పరుగులు చేసింది. జట్టులో ప్రవీణ్‌కుమార్ 87, యోగానంద 72, షాకిర్ 54, రాజశేఖర్ 60, ముదస్సిర్ 49 పరుగులు చేయడంతో జట్టు పటిష్ట పరిస్థితికి చేరుకుంది. రెండవ రోజు ఆట ముగిసే సమయానికి నెల్లూరు జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 48 పరుగులకు 1 వికెట్ కోల్పోయింది.