65 ఎర్రచందనం దుంగలు స్వాధీనం
- సువూరు రూ.50 లక్షలు విలువ
- ఒకకూలీ అరెస్ట్
శ్రీకాళహస్తి రూరల్(చిత్తూరు జిల్లా)
శ్రీకాళహస్తి వుండలంలోని అబ్బాబట్లపల్లిలో ఆదివారం తెల్లవారుజామున పోలీసులు 65 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఒక కూలీని అరెస్ట్ చేశారు. శ్రీకాళహస్తి రూరల్ ఎస్ఐ శ్రీకాంత్ తెలిపిన వివరాల మేరకు.. ముందస్తు సమాచారం తో అబ్బాబట్లపల్లి సమీపంలోని ఓడు చెరువు వద్ద తనిఖీలు నిర్వహించామని.. చెరువులో దాచిన ఎర్ర చందనం దుంగలు కనిపించాయని అన్నారు.
ఈ సందర్భంగా అక్కడే పొదల చాటున దాక్కున్న బత్తెయ్య(25) అనే కూలీని అదుపులోకి తీసుకున్నట్లు వివరించారు. ఎర్రచందనం దుంగలను రూరల్ పోలీస్‌స్టేషన్‌కు తరలించామన్నారు. వాటి విలువ సుమారు రూ.50 లక్షలు ఉంటుందన్నారు. కూలీని విచారిస్తున్నామని, అతను ఇచ్చే సమాచారం మేరకు ఈ దుంగలను తరలిస్తున్న స్మగ్లర్లను పట్టుకుంటామని తెలిపారు.