బీసీ రిజర్వేషన్లు పెంచాలి
పాలకొల్లు సెంట్రల్ : బీసీల్లో కులాలను పెంచుతున్నారేగానీ, రిజర్వేషన్లను పెంచడం లేదని బీసీ చైతన్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు వీరవల్లి శ్రీనివాస్ ఆవేదన వ్యక్తంచేశారు. బుధవారం స్థానిక కిరాణా మర్చంట్స్ అసోసియేషన్ భవనంలో నరసాపురం కన్వీనర్ రెడ్డి రాంబాబు అధ్యక్షతన జరిగిన బీసీ చైతన్య సమాఖ్య సమావేశం జరిగింది. దీనిలో శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా మాట్లాడుతూ..కాపు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నామన్నారు. కాపులకు రిజర్వేషన్లు ఇస్తే తమకు అభ్యంతరం లేదని, వారిని బీసీల్లో చేరిస్తే మాత్రం వ్యతిరేకిస్తామని హెచ్చరించారు.
ఈ సందర్భంగా బిసి చైతన్య వేదిక రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా, జిల్లా కన్వీనర్‌గా పెచ్చెట్టి కోటేశ్వరరావు, పట్టణ అధ్యక్షునిగా మజ్జి అప్పారావు, ప్రధాన కార్యదర్శిగా కండాపు శ్రీనివాసు, ట్రెజరర్‌గా యు కనకదుర్గాప్రసాద్ మరో ఐదుగురు సభ్యులను ఎంపిక చేశారు. కార్యక్రమంలో సమాఖ్య తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు పాటి శివకుమార్, జిల్లా కార్యదర్శి కవురు వెంకటేశ్వరరావు, జిల్లా యూత్ అధ్యక్షులు చోడే గోపీకృష్ణ, కొవ్వూరు డివిజన్ అధ్యక్షులు ఆకుల కిరణ్, ఊడి మారెమ్మ, కుడిపూడి నాగలక్ష్మి, రావాడ దుర్గాఆదిలక్ష్మి, గూడూరి దుర్గాభవాని, కవురు సత్యనారాయణ, బొక్కా గంగాధరరావు, బెజ్జవరపు నాగరాజు, వెంకటేష్ వడయార్, కొలుకులూరి అర్జునరావు తదితరులు పాల్గొన్నారు.