7న బీసీ పారిశ్రామిక వేత్తల సమ్మేళనం
పంజగుట్ట: రాష్ట్రంలోని బీసీ సామాజిక వర్గాలకు చెందిన పారిశ్రామికవేత్తలను ఒక్కతాటిపైకి తెచ్చేందుకు ఈ నెల 7వ తేదీన హైదరాబాద్ నగరం ఆబిడ్స్ లోని తాజ్‌మహల్ హోటల్లో సమ్మేళనం నిర్వహించనున్నట్లు తెలంగాణ బీసీ పారిశ్రామిక వేత్తల సమాఖ్య తెలిపింది. శనివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో పారిశ్రామికవేత్తల సమ్మేళనం పోస్టర్‌ను జాతీయ బీసీ సంక్షేమ సంఘం ప్రధానకార్యదర్శి వకుళాభరణం కృష్ణమోహన్, సమాఖ్య చైర్మన్ మర్రి ప్రభాకర్ రావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బీసీ పారిశ్రామికవేత్తలను, కార్మిక ఉద్యోగ సంఘాల నాయకులను ఒకే చోట సమావేశపరచి భవిష్యత్ కార్యాచరణను రూపొందిస్తామని తెలిపారు. తెలంగాణలో బీసీలకు ప్రత్యేక పారిశ్రామిక విధానం రూపొందించి ప్రోత్సహించాలన్నారు.