విదేశీ అందాలకు దీటైన స్వదేశీ సౌందర్యం!
ఫొటో ఫీచర్
అద్భుతమనిపించే ప్రకృతి రమణీయతను ఆస్వాదించడానికి... అపురూపమనే వాతావరణంలో గడపటానికి, అబ్బురమనిపించే అందాలను చూడటానికి... ఆకట్టుకొనే స్థలాల్లో ఆహ్లాదంగా గడపటానికి... ‘వేల మైళ్లు దాటి పోవాలి, సరిహద్దులు దాటాలి, వీసాలు తెచ్చుకోవాలి... విదేశీ కరెన్సీ చేతిలో ఉండాలి..!’ ఎంతోమందిలోని భావనలు ఇవి. అయితే మనదేశం గురించి పూర్తిగా తెలుసుకొంటే అవన్నీ కేవలం భ్రమలే అని స్పష్టమవుతుంది. ఓ సారి ఈ ఫొటోలను చూడండి...
బ్యాంకాక్‌లోని ఫ్లోటింగ్ మార్కెట్‌కు దీటైన శ్రీనగర్ ఫ్లోటింగ్ మార్కెట్
స్విస్ అందాలకు సాటైన హిమాచల్‌ప్రదేశ్‌లోని కజ్జార్
వెనీస్తో పోటీలో వెనుకబడని కేరళలోని అలెప్పీ
సహారా ఎడారికంటే నేనేం తక్కువ అంటున్నట్లు రాజస్థాన్ థార్
వెనిస్లోని బురానో కాలనీని ప్రతిబింబించే పాండిచ్చేరిలోని ఫ్రెంచ్ కాలనీ
కొత్త ప్రదేశాలను చూడాలంటే లక్షలే అక్కరలేదు. ఆస్వాదించే అభిరుచి ఉంటే మన అందాల సౌరభాలూ అపురూపమే.