ఆహ్లాదం కరువు
శిల్పారామం... ఈ పేరు ఎత్తితే చాలు అక్కడ అభివృద్ధి చేసిందంతా తామేనని ఊరూ వాడా తేడాలేకుండా ఢంకా భజాయిస్తున్నారు కొందరు అధికార పార్టీ నేతలు. ఆహ్లాదం కోసం పార్కులో ఏర్పాటు చేసిన కొలనులో నీళ్లు లేకపోవడంతో ఎండిపోయిన చెరువును తలపిస్తోంది. పార్కులోకి వచ్చిన ప్రతి ఒక్కరూ ఇదేమి అభివృద్ధి అంటూ పెదవివిరుస్తున్నారు. కొలనులో ఉన్న బాతులు, కొంగలు కూడా కొద్ది పాటి నీరులోనే సేద తీరుతున్నాయి.