Behavior elections
-
వాష్‌రూమ్ వాడి సరిగ్గా నీళ్లు కొట్టరు.. ఎలా చెప్తే మారతారు మగాళ్లు?
హైదరాబాద్ మూసాపేటలో రెండు రోజుల క్రితం గృహిణి ఆత్మహత్య చేసుకుంది. కారణం? వాష్‌రూమ్‌ను వాడిన భర్త నీళ్లు కొట్టకపోవడంపై ఆమె విసుక్కుంది. భర్త వాదనకు దిగాడు. అంతే. స్త్రీలకు మగవారి దురలవాట్లు కొన్ని ససేమిరా నచ్చవు. వారు ఆ సంగతి చెప్పినప్పుడు వాటిని మానుకోవడం మగవాళ్ల కనీస సంస్కారం. ఎన్ని విధాలుగా చెప్తే మారుతారు మగవారు? నాన్నకు అమ్మ చెప్పలేదు. భర్తకు భార్య చెప్పలేదు. తండ్రికి కూతురు చెప్పలేదు. ఒకసారి చెప్పి ఉంటారు. విని ఉండరు. మరోసారి చెప్పి ఉంటారు. లెక్క చేసి ఉండరు. ఇంకోసారి చెప్పడం మానుకుని ఉంటారు. మానుకున్నారు కదా అని అలవాటు కొనసాగిస్తూ ఉంటారు. ఇప్పుడు దీనిని తిరగేద్దాం. నాన్నకు స్కూటర్ ఉదయాన్నే శుభ్రంగా తుడిచి కనపడకపోతే కోపం వస్తుందనుకుందాం. అప్పుడు అమ్మ ఏం చేస్తుంది. ఆయనకు కోపం వస్తుందని తనో పిల్లల చేతో ఆ పని చేయిస్తుంది. నాన్న ఆఫీసుకు వెళ్లే ముందు ఇస్త్రీ చేసిన బట్టలు లేకపోతే విసుగొస్తుందనుకుందాం. అమ్మ ఎంత అలెర్ట్‌గా ఉంటుంది. నాన్నకు ఫలానా సామ్రాణికడ్డి వాసన పడదనుకుందాం. అప్పుడు అమ్మ ఆ సామ్రాణి కడ్డీలను బయట పారేస్తుంది. నాన్నకు ఇష్టం లేనివి ఇంట్లో ఉండవు. కాని అమ్మకు ఇష్టం లేనివి? బాల్యం నుంచి ప్రభావాలు అమ్మ ఒక ఇంటి నుంచి వస్తుంది. నాన్న ఒక ఇంటి నుంచి వస్తాడు. ఇద్దరూ కలిసి ఒక చోట చేరి జీవితం మొదలెడతారు. నాన్నకు ఎలాగైతే బాల్యం నుంచి కొన్ని అలవాట్లు, అభిరుచులు ఉంటాయో అమ్మకు కూడా అలాగే ఉంటాయి. కొన్ని తీవ్రమైన ఇష్టాలు అయిష్టాలు ఏర్పడి ఉంటాయి. కాని వాటికి నాన్న విషయంలో చెల్లుబాటయినట్టుగా అమ్మ విషయంలో కాదు. ఆ... ఏముందిలే.. అనే భావన. ఈ భావన ఇంకా ఎంత కాలం. అసలు అమ్మకు, భార్యకు, కుమార్తెకు ఇష్టం లేని అలవాట్లను మగవాళ్లు ఎందుకు కొనసాగించాలి. చదవండి: వాష్‌రూమ్ వాడి సరిగా నీళ్లు కొట్టరు.. విడిచిన బట్టలు హ్యాంగర్‌కు తగిలించరు. పైగా! చిన్న చిన్నవే అన్నీ... మనుషులు వైముఖ్యం కావడానికి ఎదుటి వారి మీద తీవ్రమైన అసహనం పెంచుకోవడానికి యుద్ధాలు రానక్కర్లేదు. చిన్న చిన్న దురలవాట్లు చాలు. ఉదాహరణకు స్త్రీలు ఇష్టపడని ఈ దిగువ విషయాలు ఎంత మంది పురుషులు ఇళ్ళల్లో కొనసాగిస్తారో గమనించండి. ►బయట నుంచి రాగానే చెప్పులు కుదురుగ్గా విడవరు. ►విడిచిన బట్టలు హ్యాంగర్‌కు తగిలించరు. లేదా వాష్ ఏరియాలో పడేయరు. లోదుస్తులు బాత్రూమ్లోనే వదిలేస్తారు. తడి టవల్ కుర్చీ మీద ఆరేస్తారు. ►సిగరెట్ డ్రాయింగ్‌రూమ్‌లో తాగి యాష్‌ట్రే క్లీన్ చేయకుండా వదిలేస్తారు. ►ఇయర్ బడ్స్ వాడి ఇంట్లో ఏదో ఒక మూలకు పడేస్తారు. ►వాష్‌రూమ్ వాడి సరిగ్గా నీళ్లు కొట్టరు. ►షేవింగ్ చేసుకుని ఆ రేజర్ సింక్ మీదే వదిలిపెడతారు. ►అన్నం తిని ప్లేట్లోని చెత్తను డస్ట్‌బిన్‌లో వేయకుండానే సింక్‌లో పడేస్తారు. ►పెద్ద పెద్దగా కేకరిస్తూ పండ్లు తోముతారు. ►నిద్ర లేచాక దుప్పట్లు మడిచిన పాపాన పోరు ►బాత్రూమ్లోకి న్యూస్‌పేపర్ తీసుకెళ్లి తడి చేసి పట్టుకొస్తారు ►ఫోన్ ఎప్పుడూ చార్జింగ్ పెట్టుకోరు, పైపెచ్చు ఇంట్లోవాళ్లు ఛార్జింగ్ పెట్టలేదని తిడతారు. ►గీజర్, ఫ్యాన్లు, లైట్లు ఆఫ్ చేయరు. ►వీటిలోని ఏ ఒక్కటి కొనసాగించినా స్త్రీలకు కష్టం. అలాంటిది ఇవన్నీ కొనసాగించేవారు ఉంటే ఆ స్త్రీలు ఎంత రోత అనుభవించాలి. అయినా సరే వారు భర్తలతో ఇంటి మగవారితో నవ్వుతూ వ్యవహరించాలని ఆశించడం ఏం భావ్యం. తప్పు చేస్తూ దబాయింపు ఇవన్నీ పురుషులు మానుకోగల అలవాట్లే. ఇంటి స్త్రీల మీద గౌరవం, ప్రేమ ఉంటే వెంటనే మానుకోవాలి కూడా. ఎప్పుడో ఒకసారి బద్దకించవచ్చు. కాని నిత్యం ఇదే పని అంటే అది ఏం సంస్కారం. ఏదో ఒకనాడు భరించలేక స్త్రీలు మందలిస్తే పురుషులు పౌరుషానికి పోయో, అహం కొద్దో, గిల్ట్తోటో స్త్రీలపై ఎదురుదాడి చేస్తే వాటి వల్ల కలిగే ఫలితాలు ఏమీ బాగుండవు. వ్యక్తుల బయట ప్రవర్తనలు ఇబ్బందిగా ఉంటే సమాజం ఇబ్బంది పడుతుంది. ఇంటి ప్రవర్తనలు ఇబ్బందిగా ఉంటే స్త్రీ మాత్రమే ఆ బాధ అనుభవిస్తుంది. ‘ఎన్నిసార్లు చెప్పినా వినడే’ అని స్త్రీల లోలోపల విరక్తి గూడుకట్టుకోవడం ఏమీ మంచిది కాదు. కనుక మారడం పురుషుల విధి. వారికి నేరుగా చెప్పడం స్త్రీలకు వీలు కాకుంటే ఈ వ్యాసం చూపిస్తే సరి. -
అభ్యర్థులు ఎన్నికల నియమావళి పాటించాల్సిందే
కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: పార్లమెంటు, శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు విధిగా ఎన్నికల ప్రవర్తన నియమావళిని పాటించాలని జిల్లా కలెక్టర్ సి.సుదర్శన్‌రెడ్డి తెలిపారు. రాజకీయ నేతల ప్రవర్తన, సభలు, సమావేశాలు, ఊరేగింపులు తదితర వాటిని ఏ విధంగా నిర్వహించుకోవాలనే దానిని కలెక్టర్ వివరించారు. - పార్టీలు, నేతలు, అభ్యర్థులు జాతి, కుల, మత ప్రాంతీయపరమైన విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రవర్తించకూడదు. ఇతర రాజకీయ పార్టీలను విమర్శించేటప్పుడు వాటి గత చరిత్రను ఇంతకుముందు పనితీరును మాత్రమే దృష్టిలో ఉంచుకోవాలి. ప్రజా జీవితంతో సంబంధం లేని వ్యక్తిగత దూషణలు చేయరాదు. - రాజకీయ ప్రకటనల ద్వారా కుల, మత పరమైన అభ్యర్థనలు చేయకూడదు. మసీదులు, చర్చిలు, దేవాలయాలు, ఇతర ప్రార్థన, పవిత్ర స్థలాల్లో ఎన్నికల ప్రచారం చేయకూడదు. - ఓటర్లకు లంచాలు ఇచ్చి ప్రలోభాలకు గురి చేయడం, బెదిరించడం, ఒకరి స్థానంలో మరోకరిని ఓటరుగా వినియోగించుకోవడం, పోలింగ్ స్టేషన్‌కు 100 మీటర్ల పరిధిలో ప్రచారం నిర్వహించడం వంటివి చేయరాదు. - గడువు దాటాక కూడా ప్రచారం చేయడం, పోలింగ్ స్టేషన్‌కు ఓటర్లను తీసుకురావడం తిరిగి తీసుకెళ్లడం వంటివి నిషిద్ధం - అనుమతి లేకుండా ఇళ్లపై జెండాలు ఎగురవేయడం, బ్యానర్లు కట్టడం, గోడలపై నినాదాలు రాయడం, పోస్టర్లు అతికించడం నిషిద్ధం - పార్టీలు సభలు నిర్వహించాలనుకున్నప్పుడు ముందుగా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలి. సభ నిర్వహణ ప్రదేశం, సమయం గురించి తప్పకుండా చెప్పాలి. దాని బట్టి పోలీసులు శాంతి భద్రతల పరిరక్షణ, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ వంటి అవసరమైన ఏర్పాట్లు చేసుకుంటారు. - లౌడు స్పీకర్లు ఏర్పాటు చేయాలనుకుంటే ముందుగానే అనుమతి తీసుకోవాలి పార్టీలు, ఊరేగింపులకు అధికారుల నుంచి ముందుగా అనుమతి పొందాలి. ఎప్పుడు మొదలవుతుంది. ఏ మార్గం గూండా వెళుతుంది, ఎన్ని గంటలకు ముగుస్తుంది తదితర వివరాలన్నీ ముందుగా సమర్పించాలి. ఈ సమాచారాన్ని స్థానిక పోలీసులకు అందించాలి. - సమావేశాలు, ఊరేగింపులకు ఇతర పార్టీల నాయకులు, వారి అనుచరులు వాటికి భంగం కలిగించకూడదు. నిలదీయకూడదు. కరపత్రాలు పంచరాదు - ఒక పార్టీ వేసిన పోస్టరును వేరే పార్టీల వారు తొలగించరాదుఊరేగింపులో మూడు కంటే ఎక్కువ వాహనాలు దాటితే ఎన్నికల వ్యయంలో చూపించాలి,గుర్తింపు పొందిన ప్రభుత్వ స్థలంలో మాత్రమే అనుమతించబడినటువంటి పోస్టర్లు, హోర్డింగ్‌లు కటౌట్లు, బ్యానర్లు మొదలగునవి స్థానిక సంస్థల చట్టాలకు లోబడి అనుమతించబడవు. - అనుమతి లేకుండా ప్రభుత్వ స్థలాల్లో పైన పేర్కొన్న వాటిని ప్రదర్శించినచో అట్టి వారిని ఒక సంవత్సరం జైలు శిక్ష, జరిమానాతో 1997 చట్టం ప్రకారం శిక్షకు అర్హులు. - పైవేటు భవన యజమాని నుంచి రాత మూలకంగా అనుమతి పొందకుండా ఎటువంటి రాతలు గాని, బ్యానర్లు మొదలయినవి ప్రదర్శించినచో వారికి 3 నెలల వరకు జైలుశిక్ష, రూ.2 వేల వరకు జరిమానా.