ప్యారిస్ దాడిలో కొత్తగా మరో ఇద్దరు
బ్రస్సెల్స్: ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్‌లో గతేడాది ఉగ్రదాడికి పాల్పడి 130మందిని హతమార్చిన ఘటనలో తాజాగా ఇద్దరు నిందితులపై బెల్జియం పోలీసులు అభియోగాలు నమోదుచేసి గురువారం అదుపులోకి తీసుకున్నారు.
నిందితులిద్దరిని కే ఫరీద్, మర్యమ్ ఈబీగా గుర్తించిన అధికారులు.. వీరికి గతేడాది మార్చిలో బ్రసెల్స్‌లో ఆత్మాహుతి దాడికి పాల్పడ్డ ఖలీద్ ఎల్ బక్రోయ్తో సంబంధాలున్నాయని అనుమానిస్తున్నారు. సిరియా, లిబియాలో ఫ్రాన్స్ సైనిక జోక్యానికి ప్రతీకారంగా తామే ఈ దాడులు చేశామని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే.