బెల్లీ డాన్సర్లతో హీరో ఎంజాయ్
బుచారెస్ట్: విడాకుల వ్యవహారంతో విసిగిపోయిన హాలీవుడ్ హీరో జానీ డెప్(53) రిలాక్స్ కోసం రొమేనియా వెళ్లాడు. ఫ్రెండ్స్ తో ప్రైవేటు పార్టీలు చేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాడు. స్నేహితులతో కబుర్లు చెప్పుకుంటూ, అందాల భామల బెల్లీ డాన్స్ చూస్తూ గడిపాడని స్థానిక మీడియా వెల్లడించింది.
అయితే అతడు ఒత్తిడిలో ఉన్నట్టు కనబడలేదని పార్టీలో పాల్గొన్న ఓ వ్యక్తి తెలిపాడు. బీర్ తాగుతూ రిలాక్స్ అయ్యాడని చెప్పాడు. ఫెండ్స్ తో కబుర్లు చెప్పినప్పడు తన మాజీ భార్య అంబర్ హార్డ్ గురించి చాలా తక్కువగా మాట్లాడాడని వెల్లడించాడు. 'అందరినీ గుడ్డిగా నమ్ముతాను. అదే నాకు సమస్యలు తెచ్చిపెడుతోంద'ని తనతో జానీ డెప్ అన్నాడని రెస్టరెంట్ యజమాని పేర్కొన్నాడు.
తన భార్యను హింసించినట్టు జానీ డెప్ ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. తన కంటే 22 ఏళ్లు చిన్నదైన అంబర్ హార్డ్ ను 2015లో పెళ్లి చేసుకున్నాడు. అంబర్ ను చిత్రహింసలకు గురిచేయడంతో జాన్ డెప్ నుంచి ఆమె విడాకులు తీసుకుంది.