bench mark
-
ఆర్థిక సంస్థలు ఆర్బీఐ కీలక ఆదేశాలు
ముంబై: అంతర్జాతీయంగా, దేశీయంగా కొత్త ఫైనాన్షియల్ కాంట్రాక్టుల విషయంలో లండన్ ఇంటర్‌బ్యాంక్ ఆఫర్ చేస్తున్న రేట్ల (లిబార్)కు బదులుగా విస్తృత ప్రాతిపదికన ఆమోదనీయయోగ్యమైన ప్రత్యామ్నాయ రేటు (ఏఏఆర్)కు మారాలని బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థలకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గురువారం స్పష్టం చేసింది. డిసెంబర్ 31వ తేదీలోగా ఈ మేరకు నిర్ణయం తీసుకోవాలని సూచించింది. కొత్త ఫైనాన్షియల్ కాంట్రాక్టులకు లిబార్ రేట్లు ఇకపై ప్రాతిపదికగా ఉండబోవని ఫైనాన్షియల్ కాండక్ట్ అథారిటీ (ఎఫ్సీఏ) యూకే, ఈ ఏడాది మార్చి 5వ తేదీన చేసిన ప్రకటన నేపథ్యంలో ఆర్బీఐ తాజా ఆదేశాలకు జారీ చేసింది. లిబార్ రేటును బెంచ్‌మార్క్‌గా తీసుకునే ముంబై ఇంటర్ బ్యాంక్ ఫార్వార్డ్ అవుట్‌రైట్ రేటు ఎంఐఎఫ్ఓఆర్)కు కూడా ప్రత్యామ్నాయం చూసుకోవాలని ఫైనాన్షియల్ సంస్థలకు ఆర్బీఐ సూచించింది. లిబార్ రహిత ఫైనాన్షియల్ లావాదేవీల సరళి అంతర్జాతీయంగా, దేశీయంగా ఎలా ఉంటుందన్న అంశంపై తన పర్యవేక్షణ కొనసాగుతుంటుందని కూడా ఆర్బీఐ తన తాజా ఆదేశాల్లో పేర్కొంది. రుణాలకు ‘లిబార్’ ఇంటర్ బ్యాంక్ వడ్డీరేటుగా ఉంటుంది.అమెరికా క్యాపిటల్ మార్కెట్లకు ‘లిబార్’ను స్టాండెర్డ్ ఫైనాన్షియల్ ఇండెక్స్. ఈ పరిస్థితుల్లో 2023 జూన్ వరకూ అమెరికా డాలర్–లిబార్ సెట్టింగ్స్ (రేట్ల అనుసంధాన పక్రియ) అమల్లో ఉండనున్నాయి. -
ఇదో బెంచ్‌మార్క్ అవుతుంది: నాగచైతన్య
-
ఇదో బెంచ్‌మార్క్ అవుతుంది: నాగచైతన్య
‘‘నిఖిల్ కంటెంట్‌లో మంచి స్టాండర్డ్స్ మెయిన్టైన్ చేస్తాడు. అతని సినిమా ఏదైనా డిఫరెంట్‌గా ఉంటుంది. ఇక కోన వెంకట్ క్యాలిబర్, కెపాసిటీ ఏంటో నాకు తెలుసు. సినిమా చూస్తుంటే కొత్తగా ఉంది. కచ్చితంగా తెలుగు సినీ పరిశ్రమకు ఈ సినిమా ఓ ట్రెండ్ సెట్ చేస్తుందన్న నమ్మకం ఉంది’’ అని నాగచైతన్య చెప్పారు. నిఖిల్, నందిత జంటగా కోన వెంకట్ సమర్పణలో ఉదయ్ నందనవనమ్ దర్శకత్వంలో ఎంవీవీ సత్యనారాయణ నిర్మించిన ‘శంకరాభరణం’వచ్చే నెల 4న విడుదల కానుంది. ఈ సినిమా థీమ్ సాంగ్‌ను హైదరాబాద్‌లో నాగ చైతన్య ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కోన వెంకట్ మాట్లాడుతూ- ‘‘ ఈ సినిమాకు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చేస్తున్నప్పుడు థీమ్ సాంగ్ ఐడియా వచ్చింది. మేము ‘శంకరాభరణం’ టైటిల్ అనౌన్స్ చేయగానే ఫస్ట్ రెస్పాండ్ అయిన వ్యక్తి నాగచైతన్య. అతను కాల్ చేసి మరీ అభినందించారు’’ అని తెలిపారు.నిఖిల్ మాట్లాడుతూ-‘‘ఈ సినిమా ఓ నవ్వుల పండగ . పిల్లలూ పెద్దవాళ్లు అందరూ కలిసి ఎంజాయ్ చేసే సినిమా ఇది’’ అన్నారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు ఉదయ్నందనవనమ్, సంగీత దర్శకుడు ప్రవీణ్ లక్కరాజు, గేయ రచయిత శ్రీజో, ఎడిటర్ ఛోటా కె.ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.