ఇదో బెంచ్‌మార్క్ అవుతుంది: నాగచైతన్య | This is to be the benchmark movie : naga chaithanya | Sakshi
Sakshi News home page

ఇదో బెంచ్‌మార్క్ అవుతుంది: నాగచైతన్య

Published Fri, Nov 20 2015 11:24 PM | Last Updated on Thu, Aug 9 2018 7:28 PM

ఇదో బెంచ్‌మార్క్ అవుతుంది: నాగచైతన్య - Sakshi

ఇదో బెంచ్‌మార్క్ అవుతుంది: నాగచైతన్య

 ‘‘నిఖిల్  కంటెంట్‌లో మంచి స్టాండర్డ్స్ మెయిన్‌టైన్ చేస్తాడు. అతని సినిమా ఏదైనా డిఫరెంట్‌గా ఉంటుంది. ఇక కోన వెంకట్ క్యాలిబర్, కెపాసిటీ ఏంటో నాకు తెలుసు. సినిమా చూస్తుంటే కొత్తగా ఉంది. కచ్చితంగా తెలుగు సినీ పరిశ్రమకు  ఈ సినిమా ఓ ట్రెండ్ సెట్ చేస్తుందన్న నమ్మకం ఉంది’’ అని నాగచైతన్య చెప్పారు. నిఖిల్, నందిత జంటగా కోన వెంకట్ సమర్పణలో ఉదయ్ నందనవనమ్ దర్శకత్వంలో ఎంవీవీ సత్యనారాయణ నిర్మించిన ‘శంకరాభరణం’వచ్చే నెల 4న  విడుదల కానుంది.  ఈ సినిమా థీమ్ సాంగ్‌ను హైదరాబాద్‌లో నాగ చైతన్య ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా కోన వెంకట్ మాట్లాడుతూ- ‘‘ ఈ సినిమాకు బ్యాక్‌గ్రౌండ్  స్కోర్ చేస్తున్నప్పుడు  థీమ్ సాంగ్ ఐడియా వచ్చింది. మేము ‘శంకరాభరణం’ టైటిల్ అనౌన్స్ చేయగానే ఫస్ట్ రెస్పాండ్ అయిన వ్యక్తి నాగచైతన్య. అతను కాల్ చేసి మరీ అభినందించారు’’ అని తెలిపారు.నిఖిల్ మాట్లాడుతూ-‘‘ఈ సినిమా ఓ నవ్వుల పండగ . పిల్లలూ పెద్దవాళ్లు అందరూ కలిసి ఎంజాయ్ చేసే సినిమా ఇది’’ అన్నారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు ఉదయ్‌నందనవనమ్, సంగీత దర్శకుడు ప్రవీణ్ లక్కరాజు, గేయ రచయిత శ్రీజో, ఎడిటర్ ఛోటా కె.ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement