కప్పకు ముద్దెట్టిన రాణి ఏం చెప్పిందో తెలుసా!
బెంగళూరు: నగరంలోని మైసూరుకు వెళ్లే బిజీ రోడ్డు మీద రాకుమారి కప్పను ముద్దు పెట్టుకుంది. ఓ రాకుమారి ఏంటి? కప్పను ముద్దు పెట్టుకోవడం ఏంటి? అని ఆలోచిస్తున్నారా?. బెంగళూరులో రోజురోజుకూ దీనంగా తయారవుతున్న రోడ్ల పరిస్థితిపై ఆర్టిస్ట్ బాదల్ నజుందస్వామి చేపట్టిన నిరసనే కప్పను ముద్దుపెట్టుకోవడం. నగరంలోని రోడ్డపై నిలిచిన నీటిలో ఉన్న కప్ప రాజును రాకుమారి ముద్దు పెట్టుకుంటున్నట్లు చిత్రమైన నిరసనను తెలిపారు.
నగర రోడ్లపై గుంతలు ప్రమాదకరంగా మారుతున్నాయని రాత్రి సమయంలోనే కాకుండా పగటిపూట కూడా ప్రజలు సమస్యలు ఎదుర్కొంటున్నారని రాకుమారిగా నటించిన సోనా గౌడా తెలిపారు. నగరంలోని ప్రధాన రహదారుల పరిస్థితే ఇలా ఉంటే.. మిగిలిన వాటి సంగతేంటని ప్రశ్నించారు. దాదాపు పదేళ్ల నుంచి ఈ రోడ్డులో ప్రయాణిస్తున్నానని, రోజూ ఏదో ఒక యాక్సిడెంట్ ఇక్కడ జరుగుతూనే ఉంటుందని ప్రయాణీకుడు ఒకరు తెలిపారు. గతంలో నగరంలో మ్యాన్ హోల్ సమస్యపై బాదల్ వేసిన రోడ్డుపై వేసిన ఆర్ట్ వల్ల సమస్య సమసిపోయింది.