bengalore royal challengers
-
ఐపీఎల్ అభిమానులకు డబుల్ మజా
ఐపీఎల్ మొదలై రెండు వారాలైంది. ఈలోపే రెండు సూపర్ ఓవర్ మ్యాచ్‌లు అయ్యాయి. సిక్సర్లు మైదానాన్ని దాటుతున్నాయి. ఫోర్లయితే పదేపదే బౌండరీలైన్‌ను తాకుతున్నాయి. పరుగుల వరదే వరద. ఇన్నీ జరుగుతున్నా ఏదో వెలితి! అదే... వారాంతపు వినోదం డబుల్ మ్యాచ్‌ల హంగామా. ఇప్పుడా వెలతి తీరబోతోంది. ఇకపై శని, ఆదివారాల్లో రెండు మ్యాచ్‌ల మజా క్రికెట్ ప్రియులను అలరించనుంది. నైట్ రైడర్స్ వర్సెస్ క్యాపిటల్స్ ఇప్పటిదాకా విజయాల పరంగా, ఆటగాళ్ల పరంగా సమఉజ్జీలుగా నిలిచిన రెండు జట్ల మధ్య జరిగే పోరులో బ్యాటా, బంతా ఏది పైచేయి సాధిస్తుందో చూడాలి. కోల్‌కతా నైట్‌రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ చెరో మూడు మ్యాచ్‌లు ఆడాయి. రెండింట నెగ్గి ఒక్కో మ్యాచ్‌లో ఓడిపోయాయి. కానీ ఈ సీజన్లో ఈ రెండు ప్రత్యర్థులు తలపడటం ఇదే మొదటిసారి. ఇక పోటీ విషయానికొస్తే యువకులు, విదేశీ ఆల్‌రౌండర్ల సమతూకంగా ఉన్న రెండు జట్ల మధ్య శనివారం రాత్రి ఆసక్తికర మ్యాచ్ జరగడం ఖాయం. కెప్టెన్ దినేశ్ కార్తీక్, శుబ్‌మన్ గిల్, రసెల్, మోర్గాన్లతో కూడిన కోల్‌కతా, రిషభ్ పంత్, స్టొయినిస్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్లు ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య ఎవరు పైచేయి సాధిస్తారో చూడాలి. (‘ప్రియ’మైన విజయం) కోల్‌కతా మెరుగ్గా ఉంది. యువ పేసర్లు శివమ్ మావి, నాగర్కోటి గత మ్యాచ్‌ను తమ బౌలింగ్ సత్తాతో శాసించారు. అయితే ఓపెనింగ్‌లో నరైన్‌తో సమస్య ఏర్పడటంతో రిజర్వ్ ఓపెనర్ టామ్ బాంటన్‌ను దించుతుందా లేక విన్నింగ్ కాంబినేషన్నే కొనసాగిస్తుందో చూడాలి. క్యాపిటల్స్ విషయానికొస్తే గాయంతో దూరమైన ఢిల్లీ సీనియర్ స్పిన్నర్ అశ్విన్ ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగనున్నాడని కోచ్ రియాన్ హారిస్ వెల్లడించారు. గత మ్యాచ్‌లో తమ జట్టు ఆశించిన మేర ఆడలేకపోయిందని... ఈ సారి తప్పకుండా రాణిస్తామని చెప్పారు. బెంగళూరు వర్సెస్ రాజస్తాన్ ఒంట్లో ఉన్న నీటినంతా పీల్చే మ్యాచ్ ఇది. నిప్పులు చిమ్మే వేడిలో సీజన్లో తొలిసారి మధ్యాహ్నం జరిగే పోరులో రాజస్తాన్ రాయల్స్‌తో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడుతుంది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3.30 గంటలకు మొదలవుతున్నా... అక్కడ (యూఏఈలో) మాత్రం ఈ ఆట 2 గంటల నుంచే జరగడం ఆటగాళ్లకు కాస్త ఇబ్బందికరం. ఇది ప్రదర్శనపై ఎంతోకొంత ప్రభావం చూపే అవకాశముంది. గత మ్యాచ్‌లో భారీస్కోర్లతో పాటు సూపర్ ఓవర్ విజయంతో ఉన్న బెంగళూరు ఆత్మవిశ్వాసంతో ఉండగా... బ్యాటింగ్ వైఫల్యంతో చతికిలబడిన రాజస్తాన్‌ను గత ఓటమి కలవరపరుస్తోంది. అంతకుముందు ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ 200 పైచిలుకు పరుగులు చేసిన రాజస్తాన్ ఆట గతపోరులో తిరగబడింది. ముఖ్యంగా కెప్టెన్ స్మిత్, సామ్సన్ల సింగిల్ డిజిట్ స్కోర్లు బ్యాటింగ్ ఆర్డర్‌పై పెను ప్రభావం చూపించింది. వీళ్లిద్దరితో పాటు తేవటియా, ఆల్‌రౌండర్ ఆర్చర్ చెలరేగితే ప్రత్యర్థి జట్టుకు కష్టాలు తప్పవు. ఇక బెంగళూరు బెంగంతా సారథి కోహ్లిపైనే పెట్టుకుంది. మూడు మ్యాచ్‌లాడిన ఈ స్టార్ 25 పరుగులైనా చేయలేకపోయాడు. లీగ్ చరిత్రలోనే 5000 క్లబ్లో అగ్రస్థానంలో ఉన్న కోహ్లి ఫామ్ జట్టు మేనేజ్మెంట్ను కలవరపరుస్తోంది. అతను ఫామ్‌లోకి రావాలని బలంగా కోరుకుంటుంది. -
సన్‌రైజర్స్ తొలి మ్యాచ్.. విక్టరీ విషెస్
సాక్షి, హైదరాబాద్ : కరోనా వైరస్ కారణంగా ఆలస్యమైన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) అభిమానులకు అసలైన మజాను ఇస్తోంది. ముగిసింది రెండో మ్యాచ్‌లు అయినా.. క్రికెట్ కిక్‌ను అందించింది. ఇక తమ అభిమాన జట్ల మ్యాచ్ కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇక హాట్ పేవర్ టీమ్‌గా బరిలోకి దిగిన బెంగళూరు రాయల్ చాలెంజర్స్(ఆర్సీబీ), సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) మధ్య ఐపీఎల్ సీజన్ 2020 తొలి మ్యాచ్ నేడు (సోమవారం) జరుగనుంది. దుబాయ్ వేదికగా రాత్రి 7.30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ కోసం ఇరు జట్ల అభిమానులతో పాటు ఆటగాళ్లూ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. తెలుగు జట్టు సన్ రైజర్స్ ఈ సీజన్లో ఎన్నో ఆశలతో బరిలోకి దిగుతోంది. దీంతో నేటి తొలిమ్యాచ్‌లో విజయం సాధించాలని అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. (రైనా విలవిల.. నాకే ఎందుకిలా?) దీనిలో భాగంగానే టాలీవుడ్ సీనియర్ నటుడు విక్టరీ వెంకటేష్ హైదరాబాద్ సన్‌రైజర్స్ జట్టుకు ఆల్‌ది బెస్ట్ చెప్పాడు. తొలి మ్యాచ్‌లో ఆడుతున్నందున విషెస్ తెలియజేసిన విక్టరీ.. తమ మద్దతు ఎప్పుటికీ ఉంటుందని మరోసారి తన అభిమానాన్ని వ్యక్తం చేశాడు. క్రికెట్‌పై వెంకీకి మొదటి నుంచీ మక్కువ ఎక్కువే. హైదరాబాద్‌లో మ్యాచ్ జరిగితే మైదానంలో వాలిపోవాల్సిందే. ఇక సొంత జట్టుకు మద్దతు విషయంలో ఎప్పుడూ ముందువరుసలోనే ఉంటాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మరోవైపు వెంకటేష్‌తో పాటు టాలీవుడ్ హీరోలు మంచు మనోజ్‌తో సహా మరికొంత మంది సన్‌రైజర్స్‌కు గుడ్‌లక్ చెప్పారు. ఇక ఆర్సీబీ, ఎస్ఆర్హెచ్లకు ఇదే తొలి మ్యాచ్ కావడం.. విధ్వంసం సృష్టించే ఆటగాళ్లకు కొదవలేకపోవడంతో అభిమానులకు అసలైన ఐపీఎల్ మజా అందనుంది. ఇక తొలిలో విజయం కోసం ఇరు జట్లూ వ్యహాలను సిద్ధం చేశాయి. (రైజింగ్‌కు వేళాయె...) -
'పార్దీవ్ పటేల్ టాలెంట్ పై నాకు నమ్మకం ఉంది'
షార్జా: నిన్నటి ఐపీఎల్ మ్యాచ్ లో బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్ విజయంలో కీలక పాత్ర పోషించిన పార్దీవ్ పటేల్ ను ఆ ప్రాంఛైజీ యజమాని విజయ్ మాల్యా పొగడ్తలతో ముంచెత్తాడు. ముంబై ఇండియన్స్ తో జరిగిన గత మ్యాచ్ లో పార్దీవ్, డివిలియర్స్ లు కీలక భాగస్వామ్యం నెలకొల్పి జట్టును కష్టాల్లో నుంచి గట్టెక్కించారని మాల్యా తెలిపారు. మ్యాచ్ ముగిసిన అనంతరం ఆర్సీబీ అధికారిక వెబ్ సైట్ కు ఇచ్చిన ఇంటూర్యూలో ఆయన పార్దీవ్ ను ప్రశంచించాడు. 'నాకు ఎప్పుడు పార్దీవ్ ఆటపై నమ్మకం ఉంది. అతను టాలెంట్ ఉన్న కుర్రాడు. ఆ విషయాన్ని కీలక ఇన్నింగ్స్ తో నిలబెట్టాడు'. అని మాల్యా అన్నారు. డివిలియర్స్ తో కలిసి అతను ఆడిన తీరు ఆమోఘమని తెలిపారు. విరాట్ కోహ్లి, యువరాజ్ సింగ్ లు పరుగులేమీ చేయకుండా పెవిలియన్ కు చేరి జట్టును కష్టాల్లోకి నెట్టిన తరుణంలో పార్దీవ్, డివిలియర్స్ లు నెలకొల్పిన చూడచక్కని ఇన్నింగ్స్ బెంగళూర్ కు విజయాన్ని అందించింది. వీరిద్దరూ నాలుగో వికెట్ కు 99 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసిన సంగతి తెలిసిందే.