Beta vesions
-
మీ ఫోన్ డెడ్ అయ్యిందా? ఇలా వినియోగించుకోండి
వాట్సాప్ వినియోగదారులకు కోసం వాట్సాప్ మల్టీ డివైజ్ఆప్షన్ అందుబాటులోకి తెచ్చింది. గత కొంతకాలంగా యూజర్లు మల్టీ డివైజ్ఆప్షన్ను ఎనేబుల్ చేయాలంటూ వాట్సాప్‌కు రిక్వెస్ట్ చేశారు. దీంతో ఆ ఆప్షన్‌పై వర్క్ చేస్తున్న వాట్సాప్ యాజమాన్యం యూజర్లకు శుభవార్త చెప్పింది. ప్రస్తుతం పరిమిత సంఖ్యలో ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు చెప్పింది. వాట్సాప్ కమ్యూనిటీ బ్లాగ్ 'వాట్సాప్ బీటా' వివరాల ఆధారంగా.. వాట్సాప్‌ను వినియోగదారుడు తన ఫోన్‌తో పాటు మరో నాలుగు రకాల డివైజ్‌లలో వినియోగించుకోవచ్చు. వాట్సాప్ వినియోగంలో ఉన్నప్పుడు ఒక్కోసారి ఫోన్ ఛార్జింగ్ దిగిపోయి డెడ్ అయినా మిగిలిన నాలుగు డివైజ్‌లలో వాట్సాప్ ఆన్‌లోనే ఉంటుంది. ఇది పూర్తి ఎండ్ టూ ఎండ్ స్క్రిప్ట్ తో సెక్యూరిటీ, ప్రైవసీని కలిగి ఉంటున్నట్లు పేర్కొంది. మల్టీ డివైజ్ ఫీచర్‌ను ఎలా వినియోగించాలి ఈ మల్టీ డివైజ్ ఫీచర్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదు కాబట్టి ప్రస్తుతం ఈ ఫీచర్‌ను వినియోగించడం అసాధ్యం. వాట్సాప్ బీటా బ్లాగ్ పోస్ట్‌లో ప్రస్తుతం మల్టీ డివైజ్ ఆప్షన్‌ను కొంతమంది యూజర్లకు మాత్రమే అనుమతిస్తూ టెస్ట్ ట్రయిల్స్‌ను నిర్వహిస్తున్నట్లు పోస్ట్‌లో పేర్కొంది. దానికి తోడు అదనంగా మరిన్ని ఫీచర్స్‌ను యాడ్స్ చేయాలని భావిస్తోంది. ఇక ఈ ఆప్షన్‌ను ఆండ్రాయిడ్ ,ఐఓఎస్ యూజర్లు పూర్తిస్థాయిలో ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో క్లారిటీ ఇవ్వలేదు. Very excited to be launching a beta of our new multi-device capability for @WhatsApp. Now you can use our desktop or web experiences even when your phone isn't active and connected to the internet. All secured with end-to-end encryption. Learn more: https://t.co/AnFu4Qh6Hd — Will Cathcart (@wcathcart) July 14, 2021 -
వాట్సాప్ కొత్త ఫీచర్.. ఏంటో తెలుసా?
1.2 బిలియన్ యూజర్ బేస్ ఉన్న పాపులర్ సోషల్ మీడియా యాప్ వాట్సాప్, తన యూజర్ల కోసం మరో కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇష్టమైన వ్యక్తిగత చాట్ ను లేదా గ్రూప్ చాట్ ను టాప్ లో ఉంచుకునేందుకు పిన్ చేసుకునే అవకాశాన్ని కల్పించడానికి ఫేవరెట్ చాట్ పేరుతో ఓ సరికొత్త ఫీచర్ ను వాట్సాప్ ప్రవేశపెట్టింది. ప్రస్తుతం ఈ ఫేవరెట్ ఫీచర్ వాట్సాప్ బీటా వెర్షన్ 2.17.162 లేదా 2.17.163 లకు మాత్రమే అందుబాటులో ఉంది. అయితే మూడు సంభాషణలను మాత్రమే యూజర్లు టాప్ లో పిన్ చేసుకోవచ్చు. టాప్ లో పిన్ చేసుకోవాలనుకున్న చాట్ కోసం.. వాట్సాప్ బీట్ యూజర్లు, అప్లికేషన్ ను ఓపెన్ చేసి, పిన్ చేయాలనుకున్న చాట్ ను హోల్డ్ చేసి పట్టుకోవాలి. హోల్డ్ చేసిన చాట్ కు పైన కుడివైపు డిలీట్, మ్యూట్, ఆర్చివ్ ఆప్షన్ల పక్కన ఇక నుంచి టాప్ లో పిన్ ఐకాన్ కూడా కనిపించనుంది. పిన్ ఐకాన్ క్లిక్ చేస్తే చాట్ టాప్ లో పిన్ అవుతోంది. ఒకవేళ అన్ పిన్ చేయాలనుకున్నా ఇదే ప్రక్రియను యూజర్లు చేపట్టవచ్చు. అయితే ప్రస్తుతం ఈ యాప్ వాట్సాప్ బీటా వెర్షన్ లకు మాత్రమే అందుబాటులో ఉందని, రెగ్యులర్ ఆండ్రాయిడ్ యాప్ కు ఇంకా ఈ ఫీచర్ ను వాట్సాప్ తెలిపింది.