వాట్సాప్ కొత్త ఫీచర్.. ఏంటో తెలుసా?
వాట్సాప్ కొత్త ఫీచర్.. ఏంటో తెలుసా?
Published Mon, May 1 2017 5:06 PM | Last Updated on Tue, Sep 5 2017 10:08 AM
1.2 బిలియన్ యూజర్ బేస్ ఉన్న పాపులర్ సోషల్ మీడియా యాప్ వాట్సాప్, తన యూజర్ల కోసం మరో కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇష్టమైన వ్యక్తిగత చాట్ ను లేదా గ్రూప్ చాట్ ను టాప్ లో ఉంచుకునేందుకు పిన్ చేసుకునే అవకాశాన్ని కల్పించడానికి ఫేవరెట్ చాట్ పేరుతో ఓ సరికొత్త ఫీచర్ ను వాట్సాప్ ప్రవేశపెట్టింది. ప్రస్తుతం ఈ ఫేవరెట్ ఫీచర్ వాట్సాప్ బీటా వెర్షన్ 2.17.162 లేదా 2.17.163 లకు మాత్రమే అందుబాటులో ఉంది. అయితే మూడు సంభాషణలను మాత్రమే యూజర్లు టాప్ లో పిన్ చేసుకోవచ్చు.
టాప్ లో పిన్ చేసుకోవాలనుకున్న చాట్ కోసం.. వాట్సాప్ బీట్ యూజర్లు, అప్లికేషన్ ను ఓపెన్ చేసి, పిన్ చేయాలనుకున్న చాట్ ను హోల్డ్ చేసి పట్టుకోవాలి. హోల్డ్ చేసిన చాట్ కు పైన కుడివైపు డిలీట్, మ్యూట్, ఆర్చివ్ ఆప్షన్ల పక్కన ఇక నుంచి టాప్ లో పిన్ ఐకాన్ కూడా కనిపించనుంది. పిన్ ఐకాన్ క్లిక్ చేస్తే చాట్ టాప్ లో పిన్ అవుతోంది. ఒకవేళ అన్ పిన్ చేయాలనుకున్నా ఇదే ప్రక్రియను యూజర్లు చేపట్టవచ్చు. అయితే ప్రస్తుతం ఈ యాప్ వాట్సాప్ బీటా వెర్షన్ లకు మాత్రమే అందుబాటులో ఉందని, రెగ్యులర్ ఆండ్రాయిడ్ యాప్ కు ఇంకా ఈ ఫీచర్ ను వాట్సాప్ తెలిపింది.
Advertisement