ఢిల్లీలో ‘ముంపు’ పోరు
భద్రాచలం: పోలవరం ప్రాజెక్టు ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బదలాయింపు చేయడాన్ని నిరసిస్తూ భద్రాచలం జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ధర్నా చేశారు. జిల్లాలోని రాజకీయ పార్టీల నాయకులతో పాటు ఆదివాసీ సంఘాల నాయకులు ఆందోళనకు తరలివెళ్లారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని నిలిపియాలని, ఆదివాసీలను రక్షించాలని నినాదాలు చేశారు.
ఈ ధర్నాలో వైరా ఎమ్మెల్యే బానోతు మదన్‌లాల్, భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య, మాజీ ఎంపీ మిడియం బాబూరావు, టీజేఏసీ డివిజన్ కన్వీనర్ చల్లగుళ్ల నాగేశ్వరరావు, పోలవరం ప్రాజెక్టు వ్యతరేక కమిటీ కన్వీనర్ వట్టం నారాయణ, కో కన్వీనర్ గుండు శరత్, నాయకులు కె సీతారాములు, ఆదినారాయణ, వెక్కిరాల శ్రీనివాస్, సోమశేఖర్, బాలకృష్ణ, నర్సింహరావు, గౌసుద్దీన్, ఖాసీం, లచ్చిరాం, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ నాయకులు కె రంగారెడ్డి, ప్రజా సంఘ నాయకులు జగదీష్, మాలమహానాడు నాయకులు శేఖర్ పాల్గొన్నారు.