Bhainsa Market
-
ఆస్తి పన్ను వివాదంలో బైంసా వ్యవసాయ మార్కెట్
ఆదిలాబాద్: బకాయిలు చెల్లించకపోవడంతో బైంసా వ్యవసాయ మార్కెట్ కార్యలయానికి తాళం వేశారు. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లా బైంసాలో గురువారం జరిగింది. వివరాలు.. బైంసా వ్యవసాయ మార్కెట్ కమిటీ(ఏఎమ్‌సీ)కార్యాలయానికి సంబంధించి ఆస్తి పన్ను రూపంలో రూ. 26 లక్షలు, మార్కెట్‌యార్డు ఖాళీ స్థలానికి సంబంధించి రూ. 3.68 కోట్లు మున్సిపాలిటీకి చెల్లించాల్సి ఉంది. సకాలంలో పన్నులు చెల్లించాలని మున్సిపల్ అధికారులు నోటీసులు జారీ చేశారు. అయినా మార్కెట్ యార్డు అధికారులు స్పందిచకపోవడంతో గురువారం మున్సిపల్ అధికారి విజయ్‌కుమార్ ఆధ్వర్యంలో మార్కెట్ కార్యాలయానికి తాళం వేశారు. దీంతో మార్కెట్ యార్డు రోజువారి కార్యక్రమాలు నిలిచిపోయాయి. రైతులకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడటంతో దిగివచ్చిన మార్కెట్ యార్డు అధికారులు, మున్సిపల్ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు. కాగా, ముందుగా 10 శాతం నిధులు చెల్లించాలని, 15 రోజుల్లో మిగిలిన నిధులకు సంబంధించిన హామీ ఇవ్వాలని మున్సిపల్ అధికారులు పట్టుబడుతున్నారు. ఈ పరిణామాలతో సమస్య ఇంకా పరిష్కారం కాలేదు. (బైంసా) -
మధ్యాహ్నానికే తగ్గిన ధర
భైంసా, న్యూస్‌లైన్ : పంట పండించేందుకు ప్రకృతి దోబూచులాటలో.. అమ్మే క్ర మంలో వ్యాపారుల చేతిలో రైతులు కుదేలవుతున్నారు. ఏటా రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. అధికారుల ‘మద్దతు’ లభించక సహనం కోల్పోతున్నారు. ఇప్పటికే పెట్టుబడులు పెట్టి గిట్టుబాటు ధర కోసం ఎదురుచూసినా ఫలితం లేక అమ్ముకునేందుకు సిద్ధపడ్డ తరుణంలోనూ వారిని కష్టాలు వెంటాడుతున్నాయి. శనివారం భైంసా మార్కెట్‌కు ఈ ప్రాంతంలోని సుమారు 140 మంది రైతులు సోయాను విక్రయించేందుకు తీసుకొచ్చారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు సోయా రైతులు పెద్ద సంఖ్యలో రావడంతో మార్కెట్లో సోయా కుప్పలు కనిపించాయి. గాంధీగంజ్‌లో ఒకేసారి సోయా కుప్పలు కనిపించడంతో వ్యాపారులు ధర తగ్గించారు. రైతుల ఆగ్రహం... శనివారం ఉదయం నుంచి క్వింటాలు సోయాకు రూ.2150 నుంచి రూ. 3170 వరకు ప్రైవేటు వ్యాపారులు ధర చెల్లించారు. మధ్యాహ్నం నుంచి ధర ఒక్కసారిగా తగ్గుముఖం పట్టింది. క్వింటాలు సోయాకు రూ.2400 లోపే ధర నిర్ణయించారు. దీంతో పంట ఇచ్చేందుకు రైతులు ముందుకురాలేదు. ఏఎంసీ కార్యాలయానికి వెళ్లారు. తక్కువ ధర ఇస్తున్నారంటూ ఏఎంసీ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులతో గంటపాటు వాగ్వాదానికి దిగారు. విషయం తెలుసుకున్న ఏఎంసీ చైర్మ న్ విఠల్‌రెడ్డి ఫోన్లో అధికారులతో మాట్లాడారు. వ్యాపారులతో చర్చిం చి రైతులకు నష్టం జరగకుండా చూడాలని ఏఎంసీ సిబ్బందిని ఆదేశించారు. రాత్రికి కొనుగోళ్లు జరపాలని వ్యాపారులకు సూచించారు. మిగిలిన నిల్వలను ఆదివారం సెలవయినా కొనుగోలు చేయాలని సూ చించారు. దీంతో రైతులు శాంతించారు. మద్దతు ధర ఇవ్వకపోతే మళ్లీ ఆందోళనలు ఉధృతం చేస్తామన్నారు. భారీగా వస్తున్న సోయా... గత నాలుగు, ఐదు రోజులుగా వర్షం కురువడం లేదు. ఎండలు కా స్తుండడంతో రైతులంతా కుప్పలుగా కోసిన సోయాను మిల్లర్లతో ప ట్టించి గ్రామాల్లో కళ్లాలపై వేశారు. ప్రస్తుతం మార్కెట్‌కు తీసుకొస్తున్నారు. ధర పెరుగుతుందని ఆశించిన రైతులు ముందుగా సోయా కోసి ఇళ్లలోనే నిల్వలు చేశారు. చివరి వరకు ధర రాకపోవడంతో చేసేదేం లేక నిల్వలను మార్కెట్‌కు తీసుకొస్తున్నారు. ఇలాంటి తరుణంలో తేమశా తం అంతగా లేకపోయినా రైతులకు ఇబ్బందులు తప్పడం లేదని సో యారైతులు వాపోతున్నారు. ఇప్పటికైనా సోయారైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని వారు కోరుతున్నారు. ఇదిలా ఉంటే.. రాత్రి 8 గంటల నుంచి వ్యాపారులు కొనుగోళ్లు పునఃప్రారంభించారు. రాత్రిపూట సోయా కుప్పల వద్ద రైతులు పడిగాపులు కాస్తూనే ఉన్నారు.