దర్శకుడిగా మారిన ప్రముఖ ఫోటోగ్రాఫర్
ప్రముఖ సినిమాటోగ్రాఫర్ భరణి కే ధరన్ దర్శకుడిగా మారాడు. 40పైగా సినిమాలకు సినిమాటోగ్రాఫర్‌గా పని చేసిన ఆయన ‘సివంగి’కోసం మెగా ఫోన్ పట్టాడు. ఈ చిత్రంలో ఆనంది, వరలక్ష్మి శరత్ కుమార్, జాన్ విజయ్ కీలక పాత్రలు పోషించారు. ఫిమేల్ సెంట్రిక్ కథతో రూపొందుతున్న ఈ చిత్రంలో అన్ని కమర్షియల్ హంగులతో పాటు కుటుంబం విలువలకు ప్రాధాన్యతనిచ్చే అంశాలు ఉంటాయని మేకర్స్ తెలిపారు. ఓ మహిళా తన జీవితం లో ఎదురైన అనూహ్యమైన పరిస్థితులకు ఎలా ఎదురు నిలిచింది అన్నది కథాంశం. డొమెస్టిక్ క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రం ఆద్యంతం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని దర్శకుడు భరణి తెలియజేశారు.