తల్లిపై కొడవలితో దాడి
భివండీ, న్యూస్ల్: కుటుంబ కలహాల నేపథ్యంలో తల్లిపై కొడుకు కొడవలితో దాడిచేయడంతో తీవ్రగాయాలపాలైంది. ఈ ఘటన పట్టణంలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి... కామత్ఘర్ ప్రాంతానికి చెందిన భారత్ బారడ్ (33), తన సోదరుడు రఘునాథ్ల మధ్య గొడవ జరుగుతుండగా, తల్లి పుష్ప బారడ్ (62), వారిని విడిపించే ప్రయత్నం చేసింది.
దీంతో భారత్ తల్లిపై కొడవలితో దాడిచేశాడు. ఆమె కూతురు జయశ్రీ, రఘునాధ్ ముఖాలపై భారత్ భార్య శారద కారం చల్లింది. అనంతరం భార్యాభర్తలిద్దరూ పరారయ్యారు. స్థానికులు బాధితురాలిని స్థానిక నిర్మయ్ ఆస్పత్రికి తరలించారని పోలీసులు తెలిపారు.