'సెలవు అడిగితే.. చేయి చేసుకున్నాడు'
అనంతపురం: సెలవు అడిగినందుకు తనపై చేయి చేసుకున్నాడని ఎంఈవోపై ఓ ఉపాధ్యాయుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ సంఘటన అనంతపురం జిల్లా ధర్మవరంలో శనివారం జరిగింది. వివరాలు.. ధర్మవరం మండలం బాబులనాయుడిపల్లి గ్రామ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న భాస్కరయ్య ఈరోజు తనకు సెలవు కావాలని ఎంఈవో నూర్అహ్మద్ను సంప్రదించారు. దీనికి ఆయన నిరాకరించడంతో పాటు తనపై ఆగ్రహం వ్యక్తం చేశారని, అంతటితో ఆగకుండా చేయి కూడా చేసుకున్నారని ఆయన ధర్మవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేశారు.