'సెలవు అడిగితే.. చేయి చేసుకున్నాడు' | teacher complaints on MEO in anantapur | Sakshi
Sakshi News home page

'సెలవు అడిగితే.. చేయి చేసుకున్నాడు'

Published Sat, Sep 5 2015 12:18 PM | Last Updated on Fri, Jun 1 2018 8:54 PM

teacher complaints on MEO in anantapur

అనంతపురం: సెలవు అడిగినందుకు తనపై చేయి చేసుకున్నాడని ఎంఈవోపై ఓ ఉపాధ్యాయుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ సంఘటన అనంతపురం జిల్లా ధర్మవరంలో శనివారం జరిగింది. వివరాలు.. ధర్మవరం మండలం బాబులనాయుడిపల్లి గ్రామ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న భాస్కరయ్య ఈరోజు తనకు సెలవు కావాలని ఎంఈవో నూర్‌అహ్మద్‌ను సంప్రదించారు. దీనికి ఆయన నిరాకరించడంతో పాటు తనపై ఆగ్రహం వ్యక్తం చేశారని, అంతటితో ఆగకుండా చేయి కూడా చేసుకున్నారని ఆయన ధర్మవరం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement