తుక్కుగూడలో 40 తులాల బంగారం చోరీ
రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం మండలం తుక్కుగూడెంలో భవానీ నగల దుకాణంలో చోరీ జరిగింది.ఆదివారం ఉదయం ఎప్పటిలానే దుకాణం యజమాని నగల సంచి పక్కన పెట్టి షట్టర్ తీశాడు.అనంతరం నగల సంచి కనపడకపోవడంతో దుకాణం యజమాని పరిసర ప్రాంతాలను శోధించాడు.ఫలితం లేకపోవడంతో నగల దుకాణం యజమాని పోలీసులను ఆశ్రయించాడు.
పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని తనిఖీలు నిర్వహించారు.అయిన ఫలితం లేకపోవడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సంచిలో 40 తులాల బంగారంలోపాటు 12 కిలోల వెండి ఉందని భవానీ నగల దుకాణం యజమానీ పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నాడు.