పర్యాటక కేంద్రంగా ‘కందకుర్తి’
కందకుర్తి(రెంజల్), న్యూస్‌లైన్: కందకుర్తి త్రివేణి సంగమ పుష్కర క్షేత్రాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని జిల్లా పర్యాటక శాఖ అధికారి భిక్షు నాయక్ అన్నారు. శనివారం సీఎంఓ స్వర్ణలతతో కలిసి ఆయన రెంజల్ మండలంలోని కందకుర్తిని సందర్శించారు. ఇటీవల రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి సుదర్శన్‌రెడ్డి పుష్కర క్షేత్రాన్ని పరిశీలించారని అన్నారు. మంత్రి సూచనల మేరకు జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న ఆదేశాలు జారీ చేశారని చెప్పారు. పర్యాటక స్థలాల అభివృద్ధికి నిధులు పుష్కలంగా ఉన్నాయన్నారు. క్షేత్రాన్ని పరిశీలించిన అధికారులు గోదావరి నదిలో నెల రోజుల్లో బోటింగ్ సౌకర్యం కల్పిస్తామన్నారు. నదీ స్నానాలకు వచ్చే భక్తులకు కూడా అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు. వంట గదులు, విశ్రాంతి గదులు, మూత్ర శాలులు, తాగు నీటి ట్యాంకులు నిర్మాణం చేపడతామని వివరించారు.
వంటలపై అసంతృప్తి
కందకుర్తి నుంచి రెంజల్‌లోని కస్తూర్బా గాంధీ విద్యాలయాన్ని అధికారులు తనిఖీ చేశారు. విద్యార్థినులతో కలిసి భోజనం చేసిన వారు అసంతృప్తి వ్యక్తం చేశారు. బాలికలకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని నిర్వాహకులను ఆదేశించారు. విద్యార్థులను పలు ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. విద్యలో బాలికలు వెనుకబడి ఉన్నట్లు గుర్తించిన అధికారులు సిబ్బంది తీరుపై అసహనం వ్యక్తం చేశారు. పిల్లలను సొంత కుటుంబ సభ్యులుగా చూడాలని సూచించారు. ఉపాధ్యాయులు తమ తీరు మార్చుకోవాలని లేని పక్షంలో చర్యలు తప్పవని వారు హెచ్చరించారు.
అలీసాగర్,అశోక్‌సాగర్ సందర్శన
ఎడపల్లి(ఠాణాకలాన్): మండలంలోని అలీసాగర్ ఉద్యానవనాన్ని శనివారం జిల్లా పర్యాటక శాఖ అధికారి భిక్షు నా యక్ సందర్శించారు. గుట్ట పైభాగాన సుమారు 52 ఎకరాల స్థ లంలో నిర్మించనున్న పెలైట్ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను, స రిహద్దులను అడిగి తెలుసుకున్నారు. భూమికి సంబంధించిన రెవెన్యూ రికార్డు లను పరిశీలించారు. అనంతరం అశోక్‌సాగర్ ఉద్యానవనాన్ని ఆయన సందర్శించారు. ఉద్యాన వనానికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు.