వడదెబ్బతో జీడి రైతు మృతి
విజయనగరం జిల్లాలో వడదెబ్బ కారణంగా శుక్రవారం ఓ రైతు ప్రాణాలు కోల్పోయాడు. గుమ్మలక్ష్మీపురం మండలం ఇరిడి గ్రామంలో కోలక భీమారావు (58) శుక్రవారం జీడి తోటకు వెళ్లి మధ్యాహ్న సమయంలో ఇంటికి తిరిగి వచ్చాడు. కొద్దిసేపటికే అపస్మారక స్థితిలోకి వెళ్లిన అతడు ప్రాణాలు విడిచాడు.